ట్రైలర్ టాక్ : ‘రాక్షసుడు’

త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ‘రాచ్చ‌స‌న్‌’ని తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ ‘రాక్షసుడు’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన బెల్లకొండ శ్రీనివాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌లో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇందులో ఓ సైకో వరుస హత్యలు చేస్తూ ప్రజల్ని భయపెడుతూ కనిపించాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తూ కనిపించారు. ‘మనం ఊహించిన దానికంటే ఈ కేసులో ఏదో సీరియస్‌నెస్‌ ఉంది’ అనే డైలాగ్ సైకో పాత్ర డెప్త్ ని తెలియజేసింది . తమిళ్ లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరి తెలుగు ఫలితం ఎలా వుంటుందో చూడాలి. ఆగస్టు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

December 18, 2018

మంత్రి అనిల్ యాదవ్ రౌడీనా ?

మాజీ మంత్రి , ఎమ్మెల్సీ లోకేష్ శాసనమండలిలో ముఖ్యమంత్రి జగన్ కేసుల గురించి ప్రస్తావించగా,.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందిస్తూ సభలోలేని వ్యక్తుల గురించి అనవసరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు , అర్ధరాత్రి కాంగ్రెస్‌తో కుమ్మక్కై చిదంబరం కాళ్లు పట్టుకుని వైఎస్ జగన్‌పై తప్పుడు కేసులు పెట్టించారన్నారని ఆరోపించారు. కేసులపై స్టే తెచ్చుకొని చంద్రబాబు బయట తిరుగుతున్నారని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని సొంతం చేసుకున్నాడు కానీ తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ సొంతంగా పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారని కాగా అనిల్ చేసిన వ్యాఖ్యలపై దేశం నేతలు తీవ్ర స్థాయి మండిపడ్డారు. దీనిపైటీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ ను ఓ రౌడీగా అభివర్ణించారు. నెల్లూరు రౌడీ, మంత్రి అనిల్ ను సీఎం జగన్ అదుపులో పెట్టాలని హెచ్చరించారు .

December 18, 2018

కర్ణాటక హైడ్రామా.. రాత్రంత సభలోనే

కర్ణాటక రాజకీయలు సస్పెన్స్‌ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. విశ్వాస పరీక్షపై కర్నాటక అసెంబ్లీలో చర్చ హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ -జేడీఎస్‌ సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభ రేపటికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ సమావేశం కానుంది. విప్‌ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అస్పష్టంగా ఉందంటూ కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో స్పీకర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దీనిపై బిజెపి సభ్యులు నిరసనబాట పట్టారు. గవర్నర్ ఆదేశించినా ఓటింగ్ జరపడం లేదంటూ స్పీకర్ కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినదించారు. తమ ఎమ్మెల్యేలంతా రాత్రంతా ఇక్కడే ఉంటారని, ఇక్కడే ధర్నా చేస్తామని ఆ పార్టీ నేత యడ్యూరప్ప ప్రకటించారు. సభ వాయిదాపడిన అనంతరం కాంగ్రెస్‌- జేడీఎస్‌ సభ్యులు బయటకు రాగా.. బిజెపి ఎమ్మెల్యేలు మాత్రమే సభలోపలే ఉండిపోయారు.

December 18, 2018

చినబాబు పాదయాత్ర మొదలు పెడతాడట

వరుసగా రెండుసార్లు ప్రతిపక్షంలో కొనసాగిన తరువాత, ప్రజల విశ్వాసం పొందడానికి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసారు. అతను 2014 లో పవన్ కళ్యాణ్,బిజెపి మద్దతుతో ఓటమి నుండి బయటపడి గెలిచాడు. 2019 నాటికి, పవన్ లేదా బిజెపి ఇద్దరూ తెలుగు దేశానికి మద్దతు ఇవ్వకపోవటంతో జగన్ కు ఇంకా రూట్ క్లియర్ అయ్యి. దుమ్ములేపే మెజారిటీతో గెలిచాడు. పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచే బాధ్యతను టిడిపి నాయకత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ కోల్పోయిన కీర్తిని తిరిగి పొందటానికి బాలకృష్ణ లేదా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తే బాగుంటుంది అని పార్టీ నాయకులు భావిస్తున్నారట. నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయటానికి డిసైడ్ అయ్యాడట. అంటే ఇది ఆగకుండా నడిచే పాదయాత్ర కాదు. విరామాలతో కూడిన పాదయాత్ర అట. వైసిపిపై నారా లోకేష్ చేస్తున్న ట్వీట్ దాడి వల్ల టిడిపికి ఎటువంటి మైలేజీ రావడం లేదు. దింతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ

December 18, 2018

రివ్యూ: : ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

సినిమా టైటిల్ : ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తారాగణం : రామ్‌, నభా నటేశ్‌, నిధి అగర్వాల్‌, సత్యదేవ్‌, సయాజీ షిండే తదితరులు సంగీతం: మణిశర్మ నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్‌ సినిమా అంటేనే మాస్ మంత్రం. ఈసారి కూడా ఆయన మాస్ ని టార్గెట్ చేస్తూ ఓ సినిమాతీశారు. అదే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. అటు మాస్‌ ఇమేజ్‌ కోసం పరితపిస్తున్న రామ్‌ ఇందులో హీరో. మరి పూరి – రామ్‌ కలిసి మ్యాజిక్‌ చేయగలిగారా? అసలు ఏమిటీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కథ.? కథ.: శంకర్‌ (రామ్‌) లోకల్ రౌడీ. సెటిల్మెంట్ రాజా. మార్ ముంతా ఛోడ్ చింతా టైపు. డబ్బు కోసం ఓ హత్య కూడా చేస్తాడు. అయితే ఆ హత్య తరవాత జీవితం మలుపు తిరుగుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి చాందిని (నభా నటేషా)ని కోల్పోతాడు. తన ప్రేయసి చావుకి

December 18, 2018
bigg boss 3

బిగ్ బాస్ హౌస్ లో ఈ యాంకర్ కన్ఫర్మ్‌ ..మిగతా వారు వీళ్లేనా?

ఎక్కడ చూసినా బిగ్ బాస్ పేరే.. ఎవరి నోట విన్నా అదే జపం చేస్తున్నారు. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా అన్ని భాషలలో మంచి రేటింగ్స్ తో దూసుకెళ్తుంది బిగ్ బాస్ కార్యక్రమం. తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుని.. మూడో సీజన్ తో త్వరలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కానుంది. ఈ సీజన్ కు హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమం మొదలుకాక ముందే కావలసినంత హైప్ దొరుకుతుంది. షో నిర్వాహకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారంటూ.. యాంకర్ శ్వేతా రెడ్డి, వివాదాలకు మారుపేర్లు అయిన గాయత్రీ గుప్తా, శ్రీ రెడ్డి వంటి వారు ఆరోపించి.. కేసుల వరకు వెళ్లారు. ఇక కంటిస్టెంట్స్ విషయానికొస్తే రోజుకో లిస్ట్ తయారవుతుంది. ఎవరి ఊహాగానాలతో 15 మందితో కూడిన లిస్ట్ ను ప్రిపేర్ చేస్తున్నారు. వీటిపై బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటివరకు అధికారకంగా ప్రకటన ఇవ్వలేదు.

December 18, 2018
Sitara

యూట్యూబ్‌ చానల్ మొదలు పెట్టిన మహేష్ కూతురు సితార

మహేష్ బాబు సినిమాలతో బిజీ , నమ్రత ప్రొడక్షన్ వర్క్స్, యాడ్స్ అగ్రిమెంట్స్ తో బిజీ ఇప్పుడు వీరి గారాలపట్టి సితార కూడా బిజీ అయిపొయింది. చదువే కాదు ఇప్పుడు సితార కొత్త బిజినెస్ లోకి ఎంటరయ్యింది. సితార తన స్నేహితురాలు ఆద్యా (దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు)తో కలిసి ఏ అండ్‌ ఎస్‌ (A & S) అనే పేరుతో యూట్యూబ్‌ చానల్‌ను మొదలు పెట్టారు. వాళ్లిద్దరూ కలిసి చేసిన తొలి వీడియో ను ఈ రోజు పోస్ట్ చేసారు. 3 మార్కర్స్‌ చాలెంజ్‌ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియో లో బొమ్మలకు కలర్ ఫిల్ చేస్తూ కనిపించారు. ఆ వీడియో ను మహేష్ తన సోషల్ మీడియా పేజి లో పోస్ట్ చేస్తూ ఆ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వెయ్యండి..

December 18, 2018
ap budget 2019

జగన్ ప్రత్యేక హోదా తెచ్చేలా ఉన్నాడు.. మోడీ నుండి సానుకూల సంకేతాలు

ఏపీకి ప్రత్యేక హోదా కావాలి ఇది ప్రతి ఆంధ్రావాడి కలగా ఉంది ఇప్పుడు. వైస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి దీని మీద పోరాటం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అని చెప్పింది. వైస్ జగన్ సీఎం అయ్యాక తన వైఖరిని మార్చుకుంటుందేమో అని అందరు అనుకున్నారు కానీ ఇటీవల మరోసారి కుదరదు అని తేల్చి చెప్పింది. కానీ మోడీ ప్రభుత్వం నుండి కొత్త సంకేతాలు వస్తున్నాయి. అందరు ప్రత్యేక హోదా ఇక ముగిసిన అంఖం అని అన్నారు. ఇప్పుడు మరో సారి హోదా విషయం తెర పైకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పరిశీలించాలని అది సాధ్యం అవుతుందా కాదా అన్నది పరిశీలించాలని కొత్తగా రంగంలోకి దిగిన 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సిఫారసు చేసిందట నిన్నటిదాకా 14వ ఆర్థిక సంఘాన్ని చూపించి… ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది.. ఇప్పుడు మరి

December 18, 2018

హైదరాబాద్ నీటి కొరతపై కెటీఆర్ క్లారిటీ

హైదరాబాద్ కు మరో 48 రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరుందని, ఆపై కష్టాలు తప్పవని వచ్చిన ఓ పత్రిక కధనం సంచలనంగా వుంది. కాగా ఇదే అంశంపై దర్శకుడు మారుతి ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఓ ట్వీట్ చేశారు. పత్రిక కధనం ను ట్యాగ్ చేస్తూ ఇది నిజమేనా? అని అడిగారు. దీనికి సమాధానం ఇచ్చిన కేటీఆర్.. అలాంటేదేమీ లేదని చెప్పారు. ఆ రిపోర్ట్‌ కచ్చితమైనది కాదని చెప్పారు. మరికొన్ని వారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుందని, దీంతో హైదరాబాద్‌ కు 175 ఎంజీడీల నీరు అందుతుందని, తాగునీటి సమస్య చోటుచేసుకోదని చెప్పారు. ఇదే సమయంలో నగర పౌరులంతా, నీటి పొదుపు, హార్వెస్టింగ్ ల ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు.

December 18, 2018

118 మూవీ టీజర్

నందమూరి కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే నటించిన స్టైలిష్ అండ్ ఫ్రెష్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు. కేవీ గుహన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత, శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు.

About The Author

Reply