రాజకీయ వర్గాలలో కొనసాగుతున్న చర్చ ప్రకారం, టిడిపి ఫైర్‌బ్రాండ్ నాయకుడు, మాజీ విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా త్వరలో టిడిపికి విడుతున్నాడు అని సమాచారం.ఉమా ఆగస్టులో అధికారికంగా వైయస్ఆర్సిపిలో చేరడానికి సిద్ధం అయ్యాడట.
బోండా ఉమా ప్రస్తుతం కుటుంబతో కలిసి ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు. టూర్ కి వెళ్లే ముందే. అతను తన శ్రేయోభిలాషులను మరియు అతని సంఘ నాయకులను కలుసుకొని పార్టీ వీడే దాని గురించి చెప్పాడు అని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే, ఆగస్టు 5 న విజయవాడకు తిరిగి వచ్చిన తరువాత ఉమా జగన్‌ను కలుస్తాడు. బోండా ఉమా కాపు సామజిక వర్గానికి చెందినవాడు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 15 ఓట్లతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. అతను మరియు విజయవాడకు చెందిన ఇతర సీనియర్ నాయకులు టిడిపి మీద అసంతృప్తితో ఉన్నారని అందుకే వైస్సార్సీపీ వైపు చుతున్నారని అంటున్నారు.
విజయబాడ ఈస్ట్ లో వైస్సార్సీపీ వ్యూహాలకు చెక్ పెట్టడంలో బోండా కీలక పాత్ర పోషించారు కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినా బోండా గొప్ప నాయకుడు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అతడు వెళ్తే టీడీపీ కి అక్కడ పెద్ద దెబ్బె అంటున్నారు.