సార్వత్రిక ఎన్నికలు తరువాత ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్ లో ఈ సారి వ్యవసాయం రైతులు కు పెద్దపీట వేస్తారు అని తెలుస్తుంది. జమేలి ఎన్నికలు 2023 దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ సామాన్యుడికి నచ్చే విధంగా పలు ప్రకటనలు చేయొచ్చు. ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ ముఖ్యంశాలు.

1. రైతులకు ఆర్ధిక భరోసా ఇవ్వటంకోసం కిసాన్ సమ్మాన్ నిది పథకం కి అధిక మొత్తం లో నిధులు కేటాయించొచ్చు.
2. మధ్యతరగతి ఉద్యోగులు కోసం పన్ను స్లాబ్ ను పెంచుతూ సెక్షన్ 80సీ పరిధిని పెంచుతుందని భావిస్తున్నారు.
3. రైల్వే బడ్జెట్ కి కేటాయింపులు అధికంగా ఉండొచ్చు అని భావిస్తున్నారు.
4. ఉద్యోగులకు కనీస వేతనం పెన్షన్ ని పెంచాలి అన్న డిమాండ్ ఎప్పటినుండో ఉంది. దీనిపై కూడా ప్రకటన వస్తుంది అని భావిస్తున్నారు.
5. గృహరుణాలు ఫై ఉన్న వడ్డీ కి పన్ను తగ్గింపు మరింత పెంచాలి అని అధికశాతం ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై కూడా కీలకప్రకటన వస్తుంది అని భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో చూడాలి మరి సామాన్యుడికి ఎంతవరకు లబ్ధిచేకూరుతుందో.