చంద్రబాబుని ర్యాగింగ్ చేసిన విజయసాయి రెడ్డి

వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి పార్టీ గెలిచిన తర్వాత కూడా తన ట్విట్టర్ వార్ ఆపడటం లేదు. టీడీపీ ఉద్దేశించి విమర్శల వర్షం కురిపిస్తూనే వున్నారు. తాజాగా మరోసారి ఆయన చంద్రబాబు ర్యాగింగ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోక ముందే చంద్రబాబు మరో యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు ‘‘ఇకపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏలో చంద్రబాబు కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. మోదీ, అమిత్‌ షాకు మోకరిల్లే ప్రయత్నమని ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు ఎంపీలతో ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా పట్టించుకునేవారుండరు’’ అని దెప్పిపొడిచారు విజయసాయిరెడ్డి . చంద్రబాబు బిజెపి కి బాయ్ చెప్పి కాంగ్రెస్ తో జోడి కట్టిన సంగతి తెలిసిందే. కానీ బాబు అంచనా తప్పింది. మోడీ దెబ్బకి కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిగా మారింది చంద్రబాబు పరిస్థితి.

May 17, 2019

దాడులు చేయడమే రాజన్న రాజ్యమా ?

జగన్ సిఎం అయిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై వైకాపా రౌడీలుదాడులకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దీనిపై స్పందించారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని చెప్పారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేయడమేనా .. వైకాపా చెప్పిన రాజన్న రాజ్యమని ఆరోపించారు లోకేష్.

May 17, 2019

మాజీ లవర్ ని లైట్ తీసుకున్న విశాల్

విశాల్, వరలక్ష్మి మాజీ ప్రేమికులు. ఒక దశలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైయిందో.. బంధం తెంచుకున్నారు. ఇప్పుడు వీరి మధ్య స్నేహం కూడా చెడింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పై విశాల్ చేసిన కామెంట్స్ దీనికి కారణం. దీనిపై వరు స్పందిస్తూ… ‘నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో చూశా. ఇంతగా దిగజారుతావని అనుకోలేదు. నీ వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యా.ఎంతో బాధపడ్డా. నీపై నాకున్న కాస్త గౌరవం కూడా పోయింది. నువ్వు ఇప్పటి వరకు గొప్ప పనులు, గర్వంగా చెప్పుకునే పనులు చేసుంటే వాటిని ప్రజలకు వివరించు అంతే కానీ మా నాన్నని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయకు. ఓ స్నేహితుడిలా భావించాను. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. నా ఓటును కూడా నువ్వు కోల్పోయావు” అని ఓ మెసేజ్ పెట్టింది వరు. కాగా దీనిపై తాజాగా విశాల్ స్పదించాడు. ఆ మాటలు ఆమె

May 17, 2019

ప్లీజ్.. పాసులు అడగొద్దు: విరాట్

ప్రపంచకప్‌ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్, పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమైంది. విశ్వకప్ వేదికగా చిరకాల ప్రత్యర్థిని ఎదురుపడ్డ ప్రతిసారి చిత్తు చేసిన చరిత్ర మనదైతే .. దాన్ని తిరగరాయడమే పనిగా పెట్టుకొని పావులు కదుపుతున్న కసి పాక్. నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. రోమాలు నిక్క బొడుచుకునే ఉద్వేగ భరిత దృశ్యాలకు దాయాదుల సమరం వేదిక కానుంది. కాగా ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేక్ గా అమ్ముడుపోయాయి. చివరికి విరాట్ కోహ్లి కి కూడా టికెట్లు దొరకలేదు. ఆయన స్నేహితులకు ఆయన టికెట్లు ఇప్పించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన మీడియా మీట్లో చెప్పాడు.” ఇలాంటి పెద్ద టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు మ్యాచ్‌ టికెట్ల కోసం చాలా మంది అడుగుతారు. నా స్నేహితులు కూడా మేం మ్యాచ్‌ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లకి నేనొకటే విషయం చెబుతా. మీకు రావాలనిపిస్తే రండి. అంతే తప్ప

May 17, 2019

‘ఆదిత్యవర్మ’ .. ఇది కొంచెం బెటర్

విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సేష‌న‌ల్ మూవీ అర్జున్ రెడ్డి… హిందీ, తమిళ్ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే హిందీ వెర్షన్ విడుదలకు రెడీ అయ్యింది. కాగా తమిళంలో వెర్షన్ కి కొన్ని అడ్డంకులు వచ్చాయి. మొదట బాలాతో అనుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత అవుట్ పుట్ నచ్చకా మొత్తం ట్రాష్ చేసి మళ్ళీ కొత్తగా తీశారు. సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో ఇప్పుడు విక్రమ్ కొడుకు ద్రువ హీరోగా ‘ఆదిత్యవర్మ’ గా టైటిల్ మార్చిమళ్ళీ తీశారు. తాజాగా టీజర్ వచ్చింది. మొదటి టీజర్ కంటే ఇది కొంచెం గ్రిపింగ్ గా వుంది. ఒరిజనల్ టీజర్ ప్రకారమే దీనిని కట్ చేశారు. దాదాపు అవే సీన్లు కనిపించాయి. ద్రువ్ లుక్ లో కొంచెం మార్పులు వచ్చాయి. టీజర్ నేపధ్య సంగీతం కూడా పాతదే వాడుకున్నారు. మొత్తానికి మొదటిదాని కంటే ఈ

May 17, 2019

‘మల్లేశం’కి కేటీఆర్ గిఫ్ట్

ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మల్లేశం’. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోసం స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చుసిన అనంతరం .. విజయం దక్కేంత వరకూ పోరాడాలన్న సందేశాన్నిచ్చింది ‘మల్లేశం’. అంతరించిపోతున్న చేనేత కళాకారుల నైపుణ్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఈ చిత్రానికి వినోద పన్ను మినహాయించేలా కృషి చేస్తా’’ అన్నారు.

May 17, 2019

సాహో కోసం ఎదురుచూస్తున్న స్వీటీ

”సాహో సినిమా కోసం ఇంక ఆగలేకపోతున్నా”అంటుంది అనుష్క. ప్రభాస్ లేటెస్ట్ సినిమా సాహో. సుజీత్‌ దర్శకత్వం శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సినీ ప్రముఖులు, విమర్శకులు టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గానూ ఇది రికార్డు సృష్టించింది. కాగా ఈ టీజర్‌ను చూసిన అనుష్క ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయం వెల్లడించింది. ‘‘సాహో’ టీజర్‌ తెగ నచ్చంది. యూవీ క్రియేషన్స్‌, ప్రభాస్‌, సుజీత్‌.. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.

May 17, 2019

టాలీవుడ్ కి వరుస దెబ్బలు

టాలీవుడ్ పరిశ్రమకి దిష్టి తలిగినట్లువుంది. వరుసగా హీరోలు గాయపడటం టాలీవుడ్ ని కలవరపెడుతుంది. మొన్న నాగ శౌర్య, నిన్న సందీప్‌ కిషన్‌.. అంతకుముందు వరుణ్‌ తేజ్‌ ప్రమాదాలకు గురై గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా శర్వానంద్‌కు కూడా షూటింగ్‌లో భాగంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ’96’సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. `షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అదుపు తప్పి భుజాలపై ల్యాండ్‌ అవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్‌ సిబ్బంది శర్వానంద్‌ను థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు పరీక్షించి.. భుజానికి బ‌ల‌మైన గాయం కావడంతో ఆపరేషన్ చేయాలని చెప్పారు. రేపు ఆపరేషన్ జరగనుంది.

May 17, 2019

అడుక్కోవాలని ఎంపీలకు జగన్ సూచన

‘ప్రత్యేక హోదా’ చంద్రబాబు కొంప ముంచింది. కేంద్రంతో దోస్తీ కట్టి, కక్కలేక మింగలేక చివరికి ప్రజలతో ఛీ కొట్టించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు జగన్ టర్న్ వచ్చింది. ప్రత్యేక హోదాపై నిలదీయాలి. డిమాండ్ చేయాలి. కానీ జగన్ మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. నాకంత సీన్ లేదని స్వయంగా జగన్ మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు. ”మోడీకి భయం లేదు. ఆయన్ని అడుక్కోవడం తప్పితే ఇంకొ అప్సన్ లేదు” అని గెలిచిన రెండో రోజే తేల్చేశారు జగన్. తాజాగా జగన్ దిల్లీలోని ఏపీ భవన్‌లో జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని పార్టీ ఎంపీలకు చెప్పారట జగన్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినపుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. దానిని డిమాండ్ చేసి సాధించాలి. కానీ ఇక్కడ ఎవరి రాజకీయాలు వారివి. జగన్

May 17, 2019
Virataparvam Launch

మొదలైన రానా విరాటపర్వం..

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా విరాటపర్వం ఈరోజు ఆఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది. ఈ సినిమా ముహూర్తం షాట్ కి హీరో వెంక‌టేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు స్క్రిప్ట్‌ను అందించారు. సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నీదినాది ఒకే కథ’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం నుండి జరుగుతుంది. [email protected] @Sai_Pallavi92 and @venuudugulafilm's #Virataparvam launched Clap by #VictoryVenkatesh Camera switch on by #Gottipati RaviScript handover by #DSureshbabu Bankrolled

May 17, 2019

రివ్యూ : ‘ఎబిసిడి’

సినిమా టైటిల్ : : ‘ఎబిసిడి’
నటీనటులు – అల్లు శిరీష్ – రుక్షర్ ధిల్లాన్ – భరత్ – నాగబాబు – వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం – జుదా సంధి
నిర్మాతలు – మధుర శ్రీధర్ రెడ్డి – యష్ రంగినేని
దర్శకత్వం – సంజీవ్ రెడ్డి

రీమేక్ సినిమాలతో ఒక సౌలభ్యం వుంది. ఆల్రెడీ హిట్ కొట్టిన సినిమా కాబట్టి కథా సన్నివేశాల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఐతే ఇక్కడ చిన్న ఇబ్బంది వుంది. ఒక భాషలో హిట్టైన కథ మరో భాషలో ప్రేక్షకుల ఆదరిస్తారనే భరోసా లేదు. అందుకే సూపర్ హిట్లు కూడా.. రీమేకులు బోల్తా కొట్టిన సందర్భాలు చాలా వున్నాయి . ఈ వారం మరో రీమేక్ సినిమా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే అల్లు శిరీష్.. ‘ఎబిసిడి’. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ‘ఏబీసీడీ’ సినిమాని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. మరీ రీమేక్ ఇక్కడి ప్రేక్షకులకు నచ్చిందా ? ఇంతకీ ఈ సినిమాలో ఏముందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాలి.

కథ: అర‌వింద్ (అల్లు శిరీష్‌) అమెరికాలో పుట్టి పెరిగిన మాంచి సౌండ్ బాబు. తండ్రి (నాగ‌బాబు) సంపాదిస్తున్న డ‌బ్బుని జల్సా చేయడం అతడి హాబీ. కొడుకుని ఇలానే వదిలేస్తే దేనికీ పనికిరాకుండా పోతాడని భయపడ్డ తండ్రి, కొడుక్కి డ‌బ్బు విలువ తెలిసేలా ఓ ప్లాన్ చేస్తాడు. ఇండియా పంపించి ఇక్కడ ఎంబీఏ చేయమంటాడు. తండ్రి మాట ప్రకారం ఇండియా వచ్చిన అర‌వింద్ కి అసలు సంగతి తెలుస్తుంది. తన కార్డులన్నీ తండ్రి బ్లాక్ చేశాడని. కేవలం ఐదు వేల రూపాయిలతో నెల మొత్తం చదువుకోవాలని, మరి విలాసాలకు అలవాటు పడ్డ అవి.. కేవలం నెలసరి ఐదు వేల రూపాయలతో చదువు పూర్తి చేశాడా ? అవికి డబ్బు విలువ తెలిసిందా ? అమెరికాలో లగ్జరీ లైఫ్ కి లైఫ్ కి అలవాటు పడ్డ అవి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ? అనేది వెండితెరపై చూడాలి.

ఎలా వుంది ?
లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన ఓ కుర్రాడు.. కొన్ని పరిస్థితుల వల్ల సాధారణ జీవితం గడపడం అనే పాయింట్ కొత్తది కాదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా , పిల్ల జమిందార్ సినిమాల లైన్స్ ఇవే. ఇప్పుడు ‘ఎబిసిడి’లో కూడా అదే లైన్. ఐతే ఈ కథ మొత్తం పట్టణంలో నడుస్తోంది.

హిట్ పాయింట్ అయినప్పటికీ హిట్ మ్యాజిక్ మాత్రం ఇందులో రీపీట్ కాలేదు. హీరో పాత్ర చుట్టూ కామెడీ చేయాలనీ చూశారు కానీ అది ఫోర్స్ గా అనిపించింది. అమెరికా జ‌ల్సా జీవితాన్ని కానీ… ఇండియాకి వ‌చ్చాక డ‌బ్బు లేక ప‌డే పాట్లని కానీ సహజత్వానికి దూరంగా తీశాడు దర్శకుడు. దీంతో హీరోతో ట్రావెల్ కాలేకపోయాడు ప్రేక్షకుడు.

మొదటి సగం రెండో సగం అని లేదు.. సీన్లు అన్నీ పేర్చినట్లు.. ఎదో అతికినట్లుగా దేనికవి విడిగా ఉంటాయి. ఆ సీన్లతో ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. ఇందులో ఒక పొలిటికల్ సబ్ ఫ్లాట్ కూడా వుంది. ఒక ఎన్ఆర్ఐ బస్తీ ప్రజల అభిమానం సంపాదించుకోవడం అనే థీమ్ రాసుకున్న దర్శకుడు.. దానిని అంత సమర్ధవంతగా తీర్చిదిద్దలేకపోయాడు. అస‌లు క‌థ‌కి లింక్ చేసే విధానం కూడా అత‌క‌లేదు. హీరోయిన్ పాత్ర కూడా కృత్రిమంగా ఉంటుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు పండలేదు. ఎందులో కూడా ఎమోషనల్ కనెక్షన్ ఉండదు.

దర్శకుడు మరీ ఎక్కువ సినిమా లిబరిటీ తీసుకున్నాడు. ఐదు వేల రూపాయిలతో నెల గడిపే కుర్రాడు.. ఎక్కడా తగ్గడు. ప్రతిదీ బ్రాండే. అతడి లుక్ ఓవర్ లావిష్ గా వుంటుంది. అలాంటప్పుడు ప్రేక్షకుడు ఆ పాత్రతో ఎలా కనెక్ట్ అవుతాడు ?! అంతేకాదు.. విలన్ దుబాయ్‌లో ప‌వ‌ర్‌ ఫ్యాక్టరీలు న‌డుపుతూ వేల కోట్లు సంపాదిస్తుంటాడు. కానీ అత‌ను ఎన్నిక‌ల్లో గెలవాలంటే కాలేజీ విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేసినట్లు చూపిస్తారు. ఇది వాంటెడ్ గా సీన్ కోసమే అనిపిస్తుంది. అంతేకాదు.. చివర్లో యూత్ ఐకాన్ కాంటెస్ట్ వ్యవహారం మొత్తం ఫోర్స్ గా వుంటుంది. క్లైమాక్స్ కూడా ఎలాంటి సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ లేకుండా ఊహించినట్లే ముగుస్తుంది.

ఎవరెలా చేశారు ? అల్లు శిరీష్ కి ఇమేజ్ సమస్య లేదు. ఇలాంటి సినిమాలే చేయాలి అనే డిమాండ్ లేదు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే అవకాశం వుంది. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా కధలు ఎంచుకుంటున్నాడు, నటన కూడా మెరుగుపడుతుంది. శ్రీరస్తు శుభమస్తు తో పోల్చుకుంటే ఇందులో మరింత సెటిల్ గా చేశాడు. హీరోయిన్ గా చేసిన రుక్షర్ ధిల్లాన్ అందంగా వుంది. ఐతే వాళ్ళ మధ్య కెమిస్ట్రీ సరిగ్గా పండకపోయే సరికి పెద్ద ప్రాధాన్యం లేని పాత్ర అనిపిస్తుంది.

మాస్టర్ భరత్ గా చిన్న వయసులోనే లక్షల మంది అభిమానులని సొంతం చేసుకున్న భరత్..ఈ సినిమా ద్వార మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. ఐతే కధలొ లోపం ఏమిటో గానీ భరత్ పాత్రలో టైమింగ్ మరీ అంత గొప్పగా లేదు. సినిమా మొత్తం హీరో పాత్రతో ట్రావెల్ వున్నా.. కొన్ని చోట్లే నవ్విస్తాడు. కొన్ని చోట్ల నవ్వించడానికి ప్రయత్నించి విఫలం అవుతాడు. విలన్ గా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి త‌న‌యుడు రాజా న‌టించాడు. యువ రాజ‌కీయనాయ‌కుడి పాత్రలో ఆయ‌న లుక్ బాగుంది. వెన్నెల కిషోర్ పాత్ర ఈ సినిమాకి రిలీఫ్. కిశోర్ టైమింగ్ బావుంది. మిగతా పాత్రలు పరిధిమేర చేశారు.

నిర్మాణ విలువలు బావున్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. కెమరా పనితనం బావుంది. ఉన్నంతలో రిచ్ గా తీశారు. సంగీత దర్శకుడికి పెద్ద మార్కులు పడవు. ఆర్ఆర్ కూడా అంత ఎఫెక్టీవీ గా లేదు. ఒక పాట వినడానికి బావుంది. కథకు తగ్గ వనరులు సమకూర్చారు నిర్మాతలు.

ఫైనల్ పంచ్ : ‘ఎబిసిడి’.. అమెరికా బుల్లోడి సినిమాలో దమ్ము లేదు.

About The Author

Reply