
‘మిస్టర్ మజ్ను’ తర్వాత కొత్త సినిమా ప్రకటన చేయలేదు అక్కినేని అఖిల్. ఈసారి సినిమా చేయడంలో ఆలస్యం చేయనని చెప్పిన అఖిల్.. మిస్టర్ మజ్ను ఫలితం చూసి మళ్ళీ వెనక్కి తగ్గాడు. నిజానికి మిస్టర్ మజ్ను తర్వాత ఓ కథని ఓకే చేశాడు అఖిల్. కానీ ఇప్పుడు ఆ కథపై నమ్మకం కుదరలేదు. దింతో మళ్ళీ కథలు వినడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో అఖిల్ కోసం ఓ ఇద్దరు దర్శకులు రెడీగా వున్నారు. ఇవీ కూడా గీతా ఆర్ట్స్ సెట్ చేసిన కథలు. పరశురామ్, బొమ్మరిలు భాస్కర్.. గీతా ఆర్ట్స్ తో ఫిక్స్ అయ్యారు. కథలు రెడీగా వున్నాయి. ఇప్పుడు ఈ రెండు కథలు అఖిల్ దగ్గరికి వస్తున్నాయి. త్వరలోనే కథలు వినబోతున్నాడు అఖిల్. ఇందులో ఎదో ఒక కథ ఫైనల్ చేసే అవకాశం వుంది. అఖిల్ కొత్త సినిమాకి నిర్మాత సమస్యని వార్తలు వచ్చాయి. కానీ గీతా ఆర్ట్స్ అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ కావడం విశేషం. ఐతే ఇందులో నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ కూడా ఒక భాగస్వామిగా వుంటుందని చెబుతున్నారు.