
దర్శకుడు అనిల్ రావిపూడి అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ అయ్యింది యూరప్ లో. ఇంతకీ అనిల్ ని ఎవరు అరెస్ట్ చేశారో తెలుసా ? ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? మేటర్ లోకి వెళితే.. వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘F2’ సినిమా సంక్రాంతి హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఈ సినిమా హంగామా ఇంకా కొనసాగుతొంది.
ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది ఎఫ్ 2 టీమ్. తాజాగా వరుణ్‌తేజ్ ఓ సరదా ట్వీట్ చేశారు. సెట్లో అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘థియేటర్లలో కడుపుబ్బా నవ్వించినందుకు అరెస్టు చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘అంతేగా.. అంతేగా..’ అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. కాగా, ఈ సినిమా జోరు ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఫుల్ రన్ లో నడుస్తోంది ఎఫ్2.