విండీస్ తో తలపడే మన జట్టు ఇదే

ఆగస్ట్ లో ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ టూర్‌కు టీమిండియా జట్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఆ ప్రకటించింది మూడు ఫార్మాట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలుత కోహ్లీ ఈ పర్యటనకు దూరంగా ఉంటాడని వార్తలొచ్చినా అందులో నిజం లేదని తేలింది. ఇక వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రెండు నెలలు విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కింది. గస్టు 3వ తేదీ నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులను టీమిండియా ఆడనుంది. మూడు ఫార్మాట్ల టీమిండియా జట్లు: టెస్టు జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రోహిత్‌శర్మ, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మ, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ వన్డే జట్టు: విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌శర్మ(వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌పంత్‌(వికెట్‌కీపర్‌),

June 28, 2019

స్వీటీ తర్వాత సమంతనే !

సమంత సోలోగా సత్తా చాటింది. ఆమె టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా ‘ఓ బేబీ’ బాక్సాఫీసు వద్ద ఆదరగొట్టింది. జులై 5న విడుదలై ఈ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇపుడు ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా అమెరికాలో మిలియన్‌ డాలర్లు రాబట్టింది. ఈ చిత్రం అమెరికాలో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. కాగ ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.35 కోట్లకుపైగా రాబట్టింది. సోలోగా సమంత ఈ రేంజ్ వసూళు చేయడం ఇదే మొదటిసారి. బేసిగ్గా సోలో హీరోయిన్ అంటే అనుష్క ముందు వరుసలో వుంటుంది. ఆమె సినిమా హిట్ అయితే యాబైకోట్లు ఈజీగా వస్తాయి. ఇప్పుడ్డు సమంత కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.

June 28, 2019

సంపూని హర్ట్ చేసిన కార్తికేయ

హీరో కార్తికేయపై అసహనం వ్యక్తం చేశారు ‘కొబ్బరిమట్ట’ టీం. వివరాల్లోకి వెళితే.. కార్తికేయ నటించిన ‘హిప్పీ’ చిత్రంలో వాడారు కొబ్బరిమట్ట సినిమా గురించి ఓ సీన్ వుంది. ఈ సన్నివేశాన్ని కొబ్బరిమట్ట నిర్మాత రాజేశ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘హాయ్‌ కార్తికేయ. మీరు నటించిన ‘హిప్పీ’ సినిమాలో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని, సంపూర్ణేశ్‌బాబుని, నన్ను టార్గెట్‌ చేసిన సన్నివేశాన్ని చూశాను. ఇందుకు నేను ‘హిప్పీ’ సినిమాను తీసిన దర్శకుడిని తప్పుబట్టను. కానీ ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకు, నటించిన మీకు తెలియాల్సింది ఏంటంటే.. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాను, సహ నటులను గౌరవించండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై సంపూర్ణేశ్‌బాబు కూడా ట్వీట్ చేశాడు. ‘కార్తికేయ.. నా మీద వేసిన జోక్‌కి ఫర్వాలేదు. తిట్లు నాకు కొత్త కాదు. కానీ విడుదలవ్వని సినిమా గురించి తప్పుగా మాట్లాడటం న్యాయం కాదు. మేం ప్రేమించి, ఎన్నో కష్టాలు పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఇలా

June 28, 2019
minister anil kumar yadav comments on tdp party

కొత్త రికార్డ్ అంటున్న జగన్

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాల చరిత్రలో 1,33,494 ఉద్యోగాల కల్పన ఓ రికార్డు అని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని, గ్రామసచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నామని ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని లేటెస్ట్ గా ఓ ట్వీట్ చేశారు జగన్. గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై బోలెడు సందేహాలు అనుమానాలు వున్న సంగతి తెలిసిందే. టీడీపీ జన్మభూమి కమిటీల్లాగానే వాలంటీర్ల నియామకం కూడా ఉందని, వైసీపీ ప్రభుత్వం చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ వలన చిక్కులు తప్పని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం వైసిపీ కార్యకర్తలకే ఈ ఉద్యోగాలని ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం వీటినే ఉద్యోగాలుగా చెబుతున్నారు. ఐతే దీనిపై ఇంకా సరైన దిశా నిర్దేశాలు లేవని మాత్రం చెప్పాలి.

June 28, 2019

స్మితని బాగానే గుర్తుపెట్టుకున్న బాబు

సింగర్ స్మిత.. ‘మసక మసక చీకట్లో’ అంటూ సంచలనం సృష్టించిన తెలుగు పాప్ సింగర్. తర్వాత నటిగా కూడా మారింది. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా మాజీ సిఎం చంద్రబాబు ఆమెకు విషెష్ చెప్పడం ఆసక్తికరంగా వుంది. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. తను గాయనిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ చంద్రబాబు పంపిన లేఖను షేర్‌ చేసింది. ‘ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్‌. ధన్యవాదాలు చంద్రబాబు గారు’ అని ఆనందం వ్యక్తం చేసింది. ”ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు ఈ లేఖలో రాసుకొచ్చారు. స్మిత తెలుగుదేశం పార్టీ అభిమాని. అందుకే గుర్తుపెట్టుకొని మరీ ఆమెను అభినందించినట్లున్నారు చంద్రబాబు.

June 28, 2019
Manjunath Naidu Died

స్టేజి మీదే కుప్పకూలి మృతి చెందిన కమెడియన్

36 సంవత్సరాల వయసుగల కమెడియన్ మంజునాథ్ నాయుడు దుబాయ్‌లోని ఓ హోటల్‌లో పర్ఫామెన్స్‌ ఇస్తుండగా స్టేజి మీదే కుప్పకూలి మృతి చెందాడు. నటుడిగా, స్టాండప్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న మంజునాథ్ ఒక్కసారిగా వేదిక మీద గుండెపోటు తో పడిపోయాడు. చూస్తున్న జనాలు అది స్కిట్ లో భాగంగా ఆలా చేసాడని అనుకున్నారు. కొంతసేపు తరువాత తెలుసుకొని హాస్పిటల్ కి తీసుకెళితే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు. చెన్నైకి చెందిన మంజునాథ్ నాయుడు కొంత కాలంగా దుబాయ్ లో ఉంటున్నాడు. మంచి నటుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో ఇలా జరగటం దురదృష్టకరం. శుక్రవారం రాత్రి 11 గంటల సమయం లో ఇది జరిగిందని తెలుస్తుంది.

June 28, 2019

ఇస్మార్ట్ … కేటీఆర్ !

ఇప్పుడు ఫేస్‌ యాప్ హవా నడుస్తోంది. జనం తాము ముసలివాళ్లైపోతే ఎలా ఉంటారో, చిన్నప్పుడు ఎలా వుంటారో, మీసాలు గెడ్డాలు , హెయిర్ స్టయిల్.. ఇలా ఏదైనా ఈ యాప్ ద్వారా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫేస్‌ యాప్ ఫొటోలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ముఖం కూడా ఈ యాప్ ద్వారా వచ్చింది. ఎప్పుడూ మీసం, గడ్డం లేకుండా దర్శనమిచ్చే కేటీఆర్‌ ముఖానికి ఆ రెండింటిని జోడిస్తే ఎలావుంటుంది?… ఓ అభిమాని అదే పని చేశాడు. ఓ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌ ఫొటోకు ఫేస్‌ యాప్‌ ద్వారా మీసం, గడ్డం పెట్టి ఆయనకే ట్వీట్‌ చేశాడు. ‘అన్నా…గడ్డం, మీసంతో మీరు మరింత అందంగా ఉన్నారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ‘ నాట్‌బ్యాడ్‌. ఇలా కూడా బాగానే ఉన్నానే’ అంటూ అటు కేటీఆర్ రీట్వీట్ చేశారు.

June 28, 2019

అనుష్క ‘నిశ్శబ్దం’ ఎలా వుందో చూశారా ?

అనుష్క, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది . హిందీ, తమిళంలో ‘సైలెన్స్‌’ అనే పేరు పెట్టారు. తెలుగులో ‘నిశ్శబ్దం’ అనే పేరు నిర్ణయించారు. స్వీటీ చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు . ఈ పోస్టర్‌లో అనుష్క చేతులు మాత్రమే చూపించారు. ఓ మోడ్రన్ పెయింటింగ్ ని చేతులపై వుంది. అలాగే ఆమె చేతికి హ్యాండ్ లాకెట్ గా ఒక తాళం చెవి ఉండటం కూడా విశేషంగా వుంది. ఇందులో అనుష్క వినికిడి లోపం వున్న పాత్రలో కనిపిస్తుంది. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

June 28, 2019

బోనాలు సందడి షురూ

తెలంగాణ అంతా బోనాలు సందడి. నెత్తిమీద వేపమండలతో అలంకరించిన ఘటాలు. ఘటాల్లో అమ్మవారికి సమర్పించే పెరుగన్నాలు. పోతరాజుల వీరంగాలు. జంట నగరాల నుంచి పల్లెల వరకూ ఎక్కడచూసినా సందడే సందడి. పక్రుతికి కొత్తశోభ. ఊర్లకి ఆషాఢం కళ. గోల్కొండ, పాతబస్తీ లాల్ దర్వాజ, సికింద్రాబాద్ మహాకాళి, పోశమ్మ, మైసమ్మ, పెద్దమ్మ..ఇలా అనేక గ్రామదేవతల ఆలయాల్లో ఆడపడుచులు ఆనందంగాచేసుకునే పండుగ బోనాలు. పండగలో భాగంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి ఆలయం సిద్ధమైంది. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొదటి పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర నేపథ్యంలో రెండువేల మంది సిబ్బందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

June 28, 2019

కిరణ్ చూపు.. కమలం వైపు

సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, సమాఖ్య స్టార్ బాట్స్ మెన్ గా పేరు పొందిన కిరణ్ కుమార్ రెడ్డి,.. రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ కనిపించలేదు. అప్పుడప్పుడు ఎదో కార్యక్రమానికి హాజరై అలా మెరుపుతీగ మెరిసి వెళ్ళిపోతుంటారాయన. ఐతే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించలేదు కిరణ్ కుమార్. ఆయన వైకాపా లో చేరుతారని, టీడీపీ అని , కాంగ్రెస్ లోకే వస్తారాని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఐతే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. కిరణ్ కుమార్ కమలం వైపు చూస్తున్నారు. బీజేపీ కండువా కప్పుకోవడానికి సిద్దమౌతున్నారు. ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. ఊహించని నేతలు పార్టీలోకి వస్తున్నారని ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఆయన తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఇంకొద్దిరోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన ప్రకటించడం సంచలనంగా వుంది. ఏపీలో బలపడాలని బిజెపి గేట్లు

June 28, 2019

రివ్యూ: బ్రోచేవారెవరురా..


సినిమా టైటిల్: బ్రోచేవారెవరురా..
నటీనటులు : శ్రీవిష్ణు – సత్యదేవ్ – ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ – నివేదా థామస్ – నివేత పేతురాజ్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
నిర్మాత : విజయ్ కుమార్ మన్యం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ

పెద్ద స్టార్స్ లేరు. కానీ పేరున్న నటీనటులు ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. వీళ్ళంతా సినిమాని ప్రేమించే స్టార్స్. ఒక కథని నమ్మే నటులు. వీరంతా కలసి చేసిన సినిమా ”బ్రోచేవారెవరురా..” . మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’తో సెన్సిటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ… ఈ సినిమాకి దర్శకుడు. విడుదలకు ముందే ఈ సినిమా గురించి ఫిలిం సర్కిల్స్ లో మంచి టాక్ వచ్చింది. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సంగతి చూద్దాం.

కథ: కథగా చెప్పడం కంటే స్క్రీన్ ప్లేతో కథని అర్ధం చేసుకోవడం బెటర్. ఆ సంగతి రెండు లైన్స్ లో చెప్పాలంటే.. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ముగ్గురు స్నేహితులు. చదువు కంటే అల్లరి ఎక్కువ. నివేదా థామస్ వీళ్ళ గ్రూప్ లో చేరుతుంది. ఆమెకు ఏవో పర్శనల్ సమస్యలు. తండ్రితో ఏవో మనస్పర్థలు. ఆయన్ని నుండి తప్పించుకోవడానికి స్నేహితులతో కలసి కిడ్నాప్ డ్రామా ఆడుతుంది. ఇది ఒక కథ.

దీనికై రెండో కథ కూడా వుంది. విశాల్(సత్యదేవ్) సినిమా పరిశ్రమలో దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఉంటాడు. ఓ సందర్భంలో స్టార్ హీరోయిన్ నివేతకు కథ చెప్పే అవకాశం దొరుకుతుంది. సత్య కథ.. ఆ కిడ్నాప్ డ్రామాతో ముడిపడుతుంది. తర్వాత జరిగే ‘చిత్రమే’ ఈ చలన చిత్రం.

ఎలా వుంది? ముందుకు ఈ కథని రాసుకున్న దర్శకుడికి, కథని నమ్మి ‘సిల్లీ’ అని కొట్టిపారేయకుండా నటించడానికి ముందుకు వచ్చిన నటీనటులకు అభినందించాలి. ఎందుకంటే.. ఈ కథ అలాంటింది మరి. దర్శకుడు ఏం చెప్పి ఒప్పించాడో కానీ అతడి తెలివి చూస్తే ముచ్చట వేయకమానదు. సింపుల్ గా చెప్పాలంటే కంప్లీట్ డైరెక్టర్ సినిమా ఇది. ఒక గమ్మత్తయిన స్క్రీన్ ప్లేతో కట్టిపడేశాడు.

ఈ సినిమా జోనర్ గురించి చెప్పాలంటే క్రైమ్ కామెడీ ఇది. ఇలాంటి సినిమాకి స్క్రీన్ ప్లే అయవుపట్టు. ఈ సినిమాకి దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే భలే గమ్మత్తుగా ఉంటుంది. రెండు కథలు నడుస్తుంటాయి. కధలో క్యారెక్టర్లు వచ్చి పోతుంటాయి. సీన్లు నడుస్తుంటాయి. డైలాగులు పేలుతుంటాయి. అయితే ప్రతి డిటెయిల్ ని స్క్రీన్ ప్లేలో మిక్స్ చేసి అద్భుతమైన ఆర్డర్ వేశాడు దర్శకుడు. ఒక్క సీన్ కూడా వృధా కాదు. ప్రతి సీన్ కి ఒకొక్క లింక్ వేసుకుంటూ.. చిక్కుముడులు విప్పికుంటూ పోయాడు దర్శకుడు. సినిమాలో చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. వాటికి న్యాయం జరిగింది. చాలా వరకూ పాత్రలన్నీ ఫుల్ గ్రిప్ తో నడిచాయి. మలుపులు చాలా ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులకు తికమకపెట్టావు. పైగా ఆ మలుపులు భలే థ్రిల్ ఇస్తాయి.

తొలిసగంలో కొన్ని సీన్లు అవసరమా అనుకుంటాం.. కానీ అవి ఎందుకు అవసరమో రెండో సగం లో తెలివిగా చెప్పడం మెప్పిస్తుంది. గ్రాఫ్ ఎక్కడా డౌన్ కాకుండా మాంచి మొమెంటమ్ తో కథని నడిపాడు. సినిమా తొలిసగం కామెడీ కామెడీగా సాగిపోయిన రెండో సగంలో కథ సీరియస్ నోట్ తీసుకుంటుంది. ఐతే అంత సీరియస్ నెస్ లో కూడా వినోదం మిక్స్ చేయడంలో విజయం సాధించాడు. లైటర్ వెయిన్ కథలు ఇష్టపడే ప్రేక్షకుల ఈ సినిమా భలే నచ్చుతుంది. ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు కోసం వెదక్కూడదు. అలా వెదికితే మాత్రం ఇందులో చాలా లాజిక్ లెస్ సీన్స్ కనిపిస్తాయి. సినిమాటిక్ లిబారిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నారనే ఫీలింగ్ కలగకమానదు.

ఎవరెలా చేశారు ?
శ్రీ విష్ణు నటన గురించి కొత్త చెప్పనక్కర్లు. చాలా సహజంగా కనిపించాడు. నివేదా థామస్‌ నటన ఈ సినిమాకి మరో హైలెట్. స్నేహితులుగా కనిపించిన ప్రియదర్శిని, రాహుల్‌ రామకృష్ణ కు ఫుల్ మర్క్స్ పడతాయి.
సత్య, నివేదా పేతురాజ్‌లది సెపరేట్ ట్రాక్. కానీ కథలో లింక్ కావడంతో ఆ పాత్రలు భలే పండాయి. మిగతా పాత్రలన్నీ దాదాపు అలరించాయి.
టెక్నికల్ గా ఈ సినిమా స్థాయి బావుంది. మంచి కెమెరా పనితనం కనిపించింది. వివేక్ సాగర్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. లొకేషన్స్ నేచురల్ గా వున్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

ఫైనల్ పంచ్: బ్రోచేవారెవరురా… మనసు దోచేశారురా …

About The Author

Reply