చంద్రబాబుని ర్యాగింగ్ చేసిన విజయసాయి రెడ్డి

వైకాపా పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి పార్టీ గెలిచిన తర్వాత కూడా తన ట్విట్టర్ వార్ ఆపడటం లేదు. టీడీపీ ఉద్దేశించి విమర్శల వర్షం కురిపిస్తూనే వున్నారు. తాజాగా మరోసారి ఆయన చంద్రబాబు ర్యాగింగ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. ఎన్నికల షాక్‌ నుంచి తేరుకోక ముందే చంద్రబాబు మరో యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు ‘‘ఇకపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏలో చంద్రబాబు కొనసాగరట. కేంద్రంపై పోరాటాలకు విరామం ఇస్తారట. మోదీ, అమిత్‌ షాకు మోకరిల్లే ప్రయత్నమని ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. ముగ్గురు ఎంపీలతో ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నా పట్టించుకునేవారుండరు’’ అని దెప్పిపొడిచారు విజయసాయిరెడ్డి . చంద్రబాబు బిజెపి కి బాయ్ చెప్పి కాంగ్రెస్ తో జోడి కట్టిన సంగతి తెలిసిందే. కానీ బాబు అంచనా తప్పింది. మోడీ దెబ్బకి కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిగా మారింది చంద్రబాబు పరిస్థితి.

May 31, 2019

దాడులు చేయడమే రాజన్న రాజ్యమా ?

జగన్ సిఎం అయిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై వైకాపా రౌడీలుదాడులకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దీనిపై స్పందించారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని చెప్పారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపాకు ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేయడమేనా .. వైకాపా చెప్పిన రాజన్న రాజ్యమని ఆరోపించారు లోకేష్.

May 31, 2019

మాజీ లవర్ ని లైట్ తీసుకున్న విశాల్

విశాల్, వరలక్ష్మి మాజీ ప్రేమికులు. ఒక దశలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఏమైయిందో.. బంధం తెంచుకున్నారు. ఇప్పుడు వీరి మధ్య స్నేహం కూడా చెడింది. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ పై విశాల్ చేసిన కామెంట్స్ దీనికి కారణం. దీనిపై వరు స్పందిస్తూ… ‘నీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో చూశా. ఇంతగా దిగజారుతావని అనుకోలేదు. నీ వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యా.ఎంతో బాధపడ్డా. నీపై నాకున్న కాస్త గౌరవం కూడా పోయింది. నువ్వు ఇప్పటి వరకు గొప్ప పనులు, గర్వంగా చెప్పుకునే పనులు చేసుంటే వాటిని ప్రజలకు వివరించు అంతే కానీ మా నాన్నని అవమానిస్తూ వ్యాఖ్యలు చేయకు. ఓ స్నేహితుడిలా భావించాను. కానీ ఇప్పుడు నువ్వు హద్దులు దాటి ప్రవర్తించావు. నా ఓటును కూడా నువ్వు కోల్పోయావు” అని ఓ మెసేజ్ పెట్టింది వరు. కాగా దీనిపై తాజాగా విశాల్ స్పదించాడు. ఆ మాటలు ఆమె

May 31, 2019

ప్లీజ్.. పాసులు అడగొద్దు: విరాట్

ప్రపంచకప్‌ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్, పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమైంది. విశ్వకప్ వేదికగా చిరకాల ప్రత్యర్థిని ఎదురుపడ్డ ప్రతిసారి చిత్తు చేసిన చరిత్ర మనదైతే .. దాన్ని తిరగరాయడమే పనిగా పెట్టుకొని పావులు కదుపుతున్న కసి పాక్. నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. రోమాలు నిక్క బొడుచుకునే ఉద్వేగ భరిత దృశ్యాలకు దాయాదుల సమరం వేదిక కానుంది. కాగా ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేక్ గా అమ్ముడుపోయాయి. చివరికి విరాట్ కోహ్లి కి కూడా టికెట్లు దొరకలేదు. ఆయన స్నేహితులకు ఆయన టికెట్లు ఇప్పించలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన మీడియా మీట్లో చెప్పాడు.” ఇలాంటి పెద్ద టోర్నమెంట్లకు వెళ్లేటప్పుడు మ్యాచ్‌ టికెట్ల కోసం చాలా మంది అడుగుతారు. నా స్నేహితులు కూడా మేం మ్యాచ్‌ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లకి నేనొకటే విషయం చెబుతా. మీకు రావాలనిపిస్తే రండి. అంతే తప్ప

May 31, 2019

‘ఆదిత్యవర్మ’ .. ఇది కొంచెం బెటర్

విజ‌య్ దేవ‌ర‌కొండ సెన్సేష‌న‌ల్ మూవీ అర్జున్ రెడ్డి… హిందీ, తమిళ్ రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే హిందీ వెర్షన్ విడుదలకు రెడీ అయ్యింది. కాగా తమిళంలో వెర్షన్ కి కొన్ని అడ్డంకులు వచ్చాయి. మొదట బాలాతో అనుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత అవుట్ పుట్ నచ్చకా మొత్తం ట్రాష్ చేసి మళ్ళీ కొత్తగా తీశారు. సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో ఇప్పుడు విక్రమ్ కొడుకు ద్రువ హీరోగా ‘ఆదిత్యవర్మ’ గా టైటిల్ మార్చిమళ్ళీ తీశారు. తాజాగా టీజర్ వచ్చింది. మొదటి టీజర్ కంటే ఇది కొంచెం గ్రిపింగ్ గా వుంది. ఒరిజనల్ టీజర్ ప్రకారమే దీనిని కట్ చేశారు. దాదాపు అవే సీన్లు కనిపించాయి. ద్రువ్ లుక్ లో కొంచెం మార్పులు వచ్చాయి. టీజర్ నేపధ్య సంగీతం కూడా పాతదే వాడుకున్నారు. మొత్తానికి మొదటిదాని కంటే ఈ

May 31, 2019

‘మల్లేశం’కి కేటీఆర్ గిఫ్ట్

ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మల్లేశం’. ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ ఆఫ్‌ యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ఉపశీర్షిక. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కోసం స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చుసిన అనంతరం .. విజయం దక్కేంత వరకూ పోరాడాలన్న సందేశాన్నిచ్చింది ‘మల్లేశం’. అంతరించిపోతున్న చేనేత కళాకారుల నైపుణ్యానికి పెద్ద పీట వేసిన చిత్రమిది. తెలంగాణ ప్రభుత్వం చేనేత కళాకారుల కోసం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఈ చిత్రానికి వినోద పన్ను మినహాయించేలా కృషి చేస్తా’’ అన్నారు.

May 31, 2019

సాహో కోసం ఎదురుచూస్తున్న స్వీటీ

”సాహో సినిమా కోసం ఇంక ఆగలేకపోతున్నా”అంటుంది అనుష్క. ప్రభాస్ లేటెస్ట్ సినిమా సాహో. సుజీత్‌ దర్శకత్వం శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సినీ ప్రముఖులు, విమర్శకులు టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అత్యధిక వ్యూస్‌ సాధించిన టీజర్‌గానూ ఇది రికార్డు సృష్టించింది. కాగా ఈ టీజర్‌ను చూసిన అనుష్క ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయం వెల్లడించింది. ‘‘సాహో’ టీజర్‌ తెగ నచ్చంది. యూవీ క్రియేషన్స్‌, ప్రభాస్‌, సుజీత్‌.. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.

May 31, 2019

టాలీవుడ్ కి వరుస దెబ్బలు

టాలీవుడ్ పరిశ్రమకి దిష్టి తలిగినట్లువుంది. వరుసగా హీరోలు గాయపడటం టాలీవుడ్ ని కలవరపెడుతుంది. మొన్న నాగ శౌర్య, నిన్న సందీప్‌ కిషన్‌.. అంతకుముందు వరుణ్‌ తేజ్‌ ప్రమాదాలకు గురై గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా శర్వానంద్‌కు కూడా షూటింగ్‌లో భాగంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ’96’సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. `షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్లపై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అదుపు తప్పి భుజాలపై ల్యాండ్‌ అవ్వడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. కాలు కూడా స్వల్పంగా ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్‌ సిబ్బంది శర్వానంద్‌ను థాయ్‌లాండ్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు పరీక్షించి.. భుజానికి బ‌ల‌మైన గాయం కావడంతో ఆపరేషన్ చేయాలని చెప్పారు. రేపు ఆపరేషన్ జరగనుంది.

May 31, 2019

అడుక్కోవాలని ఎంపీలకు జగన్ సూచన

‘ప్రత్యేక హోదా’ చంద్రబాబు కొంప ముంచింది. కేంద్రంతో దోస్తీ కట్టి, కక్కలేక మింగలేక చివరికి ప్రజలతో ఛీ కొట్టించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు జగన్ టర్న్ వచ్చింది. ప్రత్యేక హోదాపై నిలదీయాలి. డిమాండ్ చేయాలి. కానీ జగన్ మోహన్ రెడ్డికి అంత సీన్ లేదు. నాకంత సీన్ లేదని స్వయంగా జగన్ మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడు. ”మోడీకి భయం లేదు. ఆయన్ని అడుక్కోవడం తప్పితే ఇంకొ అప్సన్ లేదు” అని గెలిచిన రెండో రోజే తేల్చేశారు జగన్. తాజాగా జగన్ దిల్లీలోని ఏపీ భవన్‌లో జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగుతూనే ఉండాలని పార్టీ ఎంపీలకు చెప్పారట జగన్. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినపుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. దానిని డిమాండ్ చేసి సాధించాలి. కానీ ఇక్కడ ఎవరి రాజకీయాలు వారివి. జగన్

May 31, 2019
Virataparvam Launch

మొదలైన రానా విరాటపర్వం..

రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కొత్త సినిమా విరాటపర్వం ఈరోజు ఆఫీషియల్ గా పూజ కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైంది. ఈ సినిమా ముహూర్తం షాట్ కి హీరో వెంక‌టేశ్ క్లాప్ కొట్టగా, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దగ్గుబాటి సురేష్ బాబు స్క్రిప్ట్‌ను అందించారు. సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నీదినాది ఒకే కథ’ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేవారం నుండి జరుగుతుంది. [email protected] @Sai_Pallavi92 and @venuudugulafilm's #Virataparvam launched Clap by #VictoryVenkatesh Camera switch on by #Gottipati RaviScript handover by #DSureshbabu Bankrolled

May 31, 2019

రివ్యూ: ఎన్జీకే

టైటిల్ : ఎన్జీకే
తారాగణం: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు – ఎస్.ఆర్.ప్రభు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్‌

సూర్యకి ’24’ తర్వాత సరైన హిట్ పడలేదు. సింగం3 కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు ఆయన సెల్వ రాఘవన్‌ తో జతకట్టాడు. సెల్వ రాఘవన్‌ అంటే వెరైటీ సినిమాలు పెట్టింది పేరు. సూర్య కోసం ఎన్జీకె అనే పొలిటికల్ కథని రాసుకున్నాడు. సాయి పల్లవి లాంటి క్రేజీ హీరోయిన్ వీరికి తోడైయింది. ఎన్నికల హడావిడి పూర్తియిన తర్వాత వచ్చిన ఈ పొలిటికల్ సినిమా ఫ్యూచర్ ఏంటి ? సూర్య కోరుకుంటున్న విజయం ఈ సినిమా ఇచ్చిందా ? ఇంతకీ ఎన్జీకే కధేంటీ ?

కథ: ఎన్జీకే .. నందగోపాల కృష్ణ (సూర్య) . బాగా చదువుకున్న వ్యక్తి. తన చదువుకి పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయగలడు. కానీ అవన్నీ పక్కన పెట్టి వూర్లో ఆర్గానిక్ వ్య‌వ‌సాయాన్ని మొద‌లుపెడ‌తాడు. త‌న‌తో పాటుగా మ‌రికొద్దిమంది యువ‌కులు కూడా ఆ బాట‌లోనే న‌డుస్తుంటారు. ఎన్జీకే ఆర్గానిక్ వ్య‌వ‌సాయం వ‌ల్ల స్థానిక ఎమ్మెల్యే కి నష్టం వస్తుంది. దీనికి ఎమ్మెల్యే ఓ ప్లాన్ వేస్తాడు. ఎన్జీకేని త‌న పార్టీలోకి చేర్చుకుని త‌న స‌హాయ‌కుడిగా చేర్చుకుంటాడు. ఇక్కడే రాజకీయం అలవాటు చేసుకుంటాడు ఎన్జీకే. తన అనుకున్న లక్ష్యం చేరడానికి రాజకీయాన్ని తెలివిగా వాడుకోవాలని ప్లాన్ చేస్తాడు. మరి అతడి ప్రయాణం ఏమైయింది ? అనుకున్న లక్ష్యం చేరాడా ? లేదా? అన్నది తెరపై చూడాలి.

ఎలా వుంది?
చదివితే వున్న మతి పోయిందని సామెత. ఈ సినిమా చూస్తే అదే ఫీలింగ్. ఒక పొలిటికల్ డ్రామాని వెరైటీగా చూపించాలని భావించిన దర్శకుడు.. ఎలాంటి ప్లాన్ లేకుండా కేవలం వెరైటీగా తీయాలనే లక్ష్యంతోనే షూటింగ్ మొదలుపెట్టి.. ఏం వెరైటీ చూపించాలో అర్ధం కాక తోచినట్లు తీసుకెళ్లినట్లనిపిస్తుంది ఎన్జీకే ని చూస్తే. ఓ సామాన్య యువకుడు రాజ‌కీయ ర‌ణ‌రంగంలో ఎత్తులు, పైఎత్తుల్ని ఎలా ఎదురుకున్నాడు అన్నది ఈ సినిమా కథ. పాయింట్ పరంగా చూసుకుంటే కొత్త కధేం కాదు. కానీ దర్శకుడు దీనికి తన వెరైటీ స్క్రీన్ ప్లే తో మాయ చేయాలనీ అనుకున్నాడు. కానీ అదేం వర్క్ అవుట్ కాలేదు. క‌థ ప‌రంగా కానీ, క‌థ‌నం ప‌రంగా కానీ ప్రేక్ష‌కుల‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది ఎన్జీకే. సెల్వ రాఘవన్ లాంటి విలక్షణ దర్శకుడు .. సూర్య లాంటి స్టార్ తో సినిమా తీశాడటంటే వాస్తవ పరిస్థితులపై ఎంతో అధ్యయనం చేశాకే రంగంలోకి దిగి ఉంటాడని, కొత్తగా ఏదో ఒకటి చూపిస్తాడని ఆశిస్తాం. కానీ ‘ఎన్జీకే’లో ఈ లక్షణాలు ఎంతమాత్రం కనిపించవు.

సినిమామొదలైన ఇరవై నిమిషాలకే ఇందులో ఏం లేదని తేలిపోతుంది. ప్రతి పాత్రనికి చాలా తేలికగా ఎలాంటి ప్రభావం లేకుండా రాసుకునట్లు అనిపిస్తుంది. ఎదో తోచిన సీన్ తీసుకెళ్ళిపోయారనే భావన కలుగుతుంది. సూర్య లాంటి స్టార్ ని పెట్టుకొని ఇదేం కద చూపిస్తున్నారనే భావన మొదటి అరగంటకె మొదలౌతుంది. ఎదో విధంగా మొదటిసగం లాగించిన దర్శకుడు.. రెండో సగం ఇంకా రొడ్డగా తీశాడు. సూర్య తమ్ముడు కార్తీ ‘ శకుని’ అనే ఓ పొలిటికల్ సినిమా చేశాడు. ఆ సినిమా అప్పట్లో తలనెప్పి మిగిల్చింది. దానికితో పొల్చుంటే సూర్య ‘ఎన్జీకే’ మరింత తలనొప్పిగా అనిపిస్తుంది.

మొదటిసగానికి నీరసించిపోయిన ప్రేక్షకుడు రెండో సగం మొదలైన కాసేపటికే నీరసంగా ఎగ్జిట్ డోర్ వంక చుస్తాడంటే అర్ధం చేసుకోవచ్చు.. సన్నివేశాలను ఎంత గందరగోళంగా తీర్చిదిద్దారో. ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని ఓ వ్యక్తి… ఏకంగా రాజకీయ పార్టీ పెట్టడం.. దానికి ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు భ‌యప‌డిపోవడం.. ఇలాంటి సీన్స్ చూస్తే సినిమా వాస్తవికతకు ఎంత దూరంలో వుంటుందో అర్ధం అవుతుంది. సినిమాకి లిబారిటీ తీసుకోవచ్చు. కానీ ఎన్జీకే వ్యవహారం మరీ టూ మచ్ అనిపిస్తుంది. ప్రతి కథలో కధనాయుకుడికి ఒక లక్ష్యం వుంటుంది. ఈ సినిమాలో కూడా వుంది. కానీ ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి వేరే రూట్లో వెళుతుంటాడు కధానాయకుడు. దింతో ప్రేక్షకుడికి కధానాయకుడికి మధ్య కనెక్షన్ కుదరదు. ప్రతి సన్నివేశం కూడా ఎదో అతికినట్లు ఉందనే భావన కలుగుతుంది.

ఎవరెలా చేశారు ?
సూర్య సినిమా ఇది. ఆయన నటనకు వంక పెట్టలేం. తనవరకూ చాలా ఎఫర్ట్ పెట్టాడు. కానీ కధ రాసుకోవడంలోనే లోపం వుంది. దింతో సూర్య కష్టం బూడిదలో పోసిన పన్నీరైయింది. అసలు ఈ కథకీ సూర్య ఎలా అంగీకారం తెలిపాడో అన్న అనుమానం కూడా కలుగుతుంది. సాయి పల్లవి నేచురల్ గా కనిపించినా ఆమె పాత్రలో నేచురాలిటీ లేదు. భర్తపై అనుమానం పడుతున్న సీన్స్ లో ఆమె నటన అదోరకంగా వుంటుంది. రకుల్ పాత్రకి ఇచ్చిన బిల్డప్ రెండో సీన్ కె లాగేయడం వల్ల ఆమె పాత్ర కూడా తేలిపోయింది. మిగతా పాత్రలు అప్పటికి అప్పుడు అన్నట్లు ఉంటాయి తప్పా పెద్దగా రిజిస్టర్ కావు.

శాంకేతికంగా కూడా సినిమాకి గొప్పమార్కులు ఏమీ పడవు. యువన్ శంకర్ రాజా.. మెరుపులు లేవు. ఒక్క పాత కూడా వినబుల్ గా లేదు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకోదు. పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకోదు. కెమరా పనితనం ఓకే అనిపించింది. నిర్మాణ విలువలు ఓకే.

ఫైనల్ పంచ్: ఎన్జీకే.. నాట్ ఓకే

About The Author

Reply