నాని గ్యాంగ్ ని చూశారా ?

నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `గ్యాంగ్‌లీడ‌ర్‌`. ఈ సినిమా దాదాపు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవలే సినిమా ప్రీ లుక్ వదిలారు. నాని సహా ఐదుగురు చేతులున్న ఫొటోను పంచుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్ రివీల్ అయ్యింది. ఇందులో నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. వారంతా మేడపై నిల్చుని బైనాక్యులర్‌ పట్టుకుని దేన్నో చూస్తున్నారు. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌ ద్వారా పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

July 5, 2019

ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ని కాపాడుతుందా ?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్‌ దృష్టిసారించింది . ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆయా రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూపీ కాంగ్రెస్ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీకి ఉత్తర్‌ ప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు. త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా వీటిపై ఇప్పటికే దృష్టి సారించింది. దీంతో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌.. ప్రియాంకను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

July 5, 2019
Mukesh Goud Health

ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం విషమం

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. గత కొద్దిరోజులుగా తను కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా మారటం తో అతని శరీరం సహకరించకపోవటం వలన వైద్యులు చికిత్సను నిలిపివేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్ పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. వైస్సార్ ప్రభుత్వం లో మంత్రిగా చేసారు. బాగా దృడంగా వుండే ముకేశ్ ను అభిమానులు ఈ పరిస్థితుల్లో చూసి షాక్ కి గురయ్యి ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

July 5, 2019
Akhil Angry On His Fourth Movie

హీరోయిన్ లేకుండా మొదలుపెట్టిన అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్-అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో సెట్స్ మీదకి వెళ్ళింది. గీతాసంస్థ నిర్మించే సినిమా ఇన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే వుండిపోయింది. ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మొదట పెద్ద హీరోయిన్ ని అనుకున్నారు. కానీ నిర్మాత అరవింద్ దానికి సుముఖం చూపలేదు. ఇప్పుడు నివేదా పేతురాజ్‌ను ఎంపికచేసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. కథ ప్రకారం హీరోయిన్ లేకుండా తీసే సీన్లు ఎక్కువే వున్నాయి. అందుకే ముందు ఆ సీన్లు అన్నీ తీసేయాలనే షూటింగ్ మొదలు స్టార్ట్ చేశారు. త్వరలోనే హీరోయిన్ పై క్లారిటీ వస్తుంది.

July 5, 2019
Roja APIIC Chairman

పని మొదలు పెట్టిన రోజా !!

నగరి నుంచి రెండవసారి ఎమ్మెల్యే గా గెలిచిన రోజాకి వైసీపీ ప్రభుత్వం లో మంత్రి పదవి ఖాయం అని అందరు అనుకున్నారు. కాని రోజాకి జగన్ మంత్రి పదవి ఇవ్వకుండా ” ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా ఈరోజు ఆర్కే రోజా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజాకి పలువురు అభినందలు తెలిపారు.రోజా ఈపదవి లో రెండు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అంతే కాదు పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అని తెలియచేసింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపింది.

July 5, 2019

మండలిలో మండిపడ్డ లోకేష్ బాబు

నారా లోకేష్ ప్రత్యేక్ష ఎన్నికల్లో రాకుండానే మంత్రి అయిపోయారు. చంద్రబాబు కుమారుడు కారణంగా రెండేసి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఐతే ఈ ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయిన లోకేష్ .. ట్విట్టర్ కి పరిమితమైపోయారు కొన్నాళ్ళుగా. ఐతే ఇప్పుడు ఎమ్మెల్సీ గా శాసనమండలిలో తన స్వరం వినిపించాడు లోకేష్. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో మాట్లాడాడు లోకేష్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. వైకాపా నుంచి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని నిలదీశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యానందిస్తామని జగన్ పాదయాత్రలో చెప్పారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించాడు లోకేష్.

July 5, 2019

‘బిజెపిని గుడ్డలూడదీసి కొడతారు’

బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ యాక్షన్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. కేంద్రంలో అధికారం అడ్డుపెట్టుకొని ఏపీలో పార్టీని విస్తారించాలని భావిస్తోంది బిజెపి. తప్పు లేదు. కానీ ఈ క్రమంలో బిజెపి ప్రవర్తిస్తున్న తీరు అంత బాలేదు. వివిధ పార్టీలలోని నేతలని కొనుక్కొని పార్టీలో నింపుకుంటుంది బిజెపి. పార్టీలో చేరిన నేతలు కేంద్రంలో మోడీని చూసుకొని ఏపీలో జెండా పాతుతామని బిల్డప్ కొడుతున్నారు. ‘ఇక మనదే రాజ్యం’ అంటున్నారు. సుజానా చౌదరి లాంటి నాయకులైతే పార్టీలో చేరి రెండు వారాలు కాలేదు కానీ ”ఏపీలో బిజెపినే సరైన ప్రత్యన్యాయమని’ డాంబికాలుపోతున్నారు. బిజెపి అవలంభిస్తున్న ఈ ధోరణి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైయింది. కేవలం జంపింగ్ జాక్స్ చేరినంత మాత్రాన పార్టీ గెలిచేస్తుందని బీజేపీ భావించడం సరైన పద్దతి కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఏపీకి బిజెపి ఏం చేసిందని ఓట్లు అడగటానికి వస్తారని అంటున్నారు. ఇంకొందరు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఏపీ ప్రజల

July 5, 2019
Kumaraswamy

గురువారం కుమారస్వామికి బలపరీక్ష ..టెన్షన్ టెన్షన్

కర్ణాటక లో రాజకీయం రసవత్తరంగా ఉంది, ఎట్టకేలకు స్పీకర్ రమేశ్ కుమార్‌ బలపరీక్షకు అధికారపక్షానికి గురువారం వరకు గడువు ఇచ్చారు. కుమారస్వామి బలపరీక్ష కు సిద్ధమని ఆల్రెడీ ప్రకటించాడు. బీజేపీ మాత్రం బలపరీక్ష ఈరోజే పెట్టమని విధానసభలో ప్లకార్డులతో డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య కూడా బలపరీక్ష కు తమ ప్రభుత్వం సిద్ధం అని చెప్పారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటకలో రాజకీయం సంక్షోభం లో పడింది. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై రేపు సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించనుంది. ఒకవేళ రాజీనామా లు కనుక ఆమెదించాలని తీర్పు వస్తే అప్పుడు మొత్తం సంఖ్యాబలం 208 కి వస్తుంది. 105 మంది కనుక మద్దతు ఉంటే కుమారస్వామి ప్రభుత్వం నిలుస్తుంది లేకపోతే పడిపోవటం ఖాయం. బీజేపీ సంఖ్యాబలం స్వత్రంత్ర అభ్యర్థులతో కలిసి 107 ఉంది. చూడాలి

July 5, 2019

ఆటో అంబులెన్స్ నడుపుతున్న 76 ఏళ్ళ పెద్దాయన

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 1.5 లక్షలకు పైగా ప్రజలు చనిపోతున్నారు. 76 ఏళ్ల హర్జిందర్ సింగ్ అనే మాజీ ట్రాఫిక్ వార్డెన్, రాజధాని నగరం ఢిల్లీలో ఓక ‘ఆటో అంబులెన్స్’ నడుపుతున్నాడు. ట్రాఫిక్ వార్డెన్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది ఆక్సిడెంట్ కు గురవ్వటం చూసాను. ఒక ఆటో కొని అంబులెన్సు లాగ తిప్పితే ప్రమాదాల బారిన పడే వారిని రక్షించగలం అని భావించాను అని చెప్తున్నాడు హర్జిందర్ సింగ్. 76 సంవత్సరాల వయస్సులో, సింగ్ రోజు ఉదయం 8 గంటలకు తన పనిని మొదలుపెడతాడు, తన కుటుంబ అవసరాలను తీర్చడానికి మరియు ప్రమాదాలకు గురైన వారికి మందులు మరియు అతని ఆటోకు ఇంధనం కొనడానికి ఈ వయసులో కూడా అదనంగా పని చేస్తున్నాడు. అంతేకాకుండా, సింగ్ తన రోగులను ఎప్పుడూ డబ్బు అడగడు .తన ఆటో వెనుక సీటు వద్ద విరాళం పెట్టెను ఒకటి పెట్టాడు, అందులో ఎవరికైనా

July 5, 2019

బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన సల్మాన్

బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ … ఓ టేబుల్‌పై బాటిల్‌ పెట్టాలి. దాని మూతను బాటిల్‌కు పూర్తిగా తిప్పి పెట్టకూడదు. కొద్దిదూరంలో నిలబడి కాలితో బాటిల్‌ క్యాప్‌ను తన్నాలి. అయితే ఈ ప్రక్రియలో ఆ బాటిల్‌ కిందపడకూడదు” ఇప్పుడు ఈ ఛాలెంజ్ వెర్రిగా చేస్తున్నారు జనాలు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ విన్యాసం చేశాడు. అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మాత్రం బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ కి ఒక పంచ్ ఇచ్చాడు. బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ… ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అని ఓ మెసేజ్ ఇచ్చాడు. దీంతో బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ వెర్రితో కొట్టుకుంటున్నావారందరికి పంచ్ ఇచ్చినట్లయింది. Don’t thakao paani bachao pic.twitter.com/PjfdGxdTJg — Salman Khan (@BeingSalmanKhan) July 14, 2019

July 5, 2019

రివ్యూ: ‘ఓ బేబీ’


సినిమా టైటిల్ : ‘ఓ బేబీ’
నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, , రావు రమేశ్‌, ప్రగతి, జగపతిబాబు, నాగశౌర్య, ఐశ్వర్య..
సంగీతం: మిక్కీ జే మేయర్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందినీ రెడ్డి

‘రంగస్థలం’ తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. కేవలం కమర్షియల్ హంగులు కాకుండా కథని మోసే సినిమాలు చేస్తుంది సమంత. యూ టర్న్, సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలు సమంతని మరో లెవల్ కి తీసుకెళ్లాయి. ఇప్పుడు ‘ఓ బేబీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సమంత. ట్రైలర్ తోనే ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ బేబీ సంగతి ఏంటో ఓ సారి చూద్దాం.

కథ: బేబీ (లక్ష్మి). వయసు 70. మహా ఛాదస్తం. ఆమె చాద‌స్తంతో ఇంట్లో కోడ‌లు, కుటుంబ స‌భ్యులు ఇబ్బంది ప‌డుతుంటారు. కోడ‌లికి గుండెపోటు కూడా వ‌స్తుంది. అందుకు బేబీనే కార‌ణ‌మ‌ని కుటుంబ స‌భ్యులు భావించ‌డంతో ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్లిపోయిన ఆమె 24 ఏళ్ల ప‌డుచు పిల్ల స్వాతి (స‌మంత‌)గా మారిపోతుంది. అదెలా? వ‌య‌సు తిరిగొచ్చాక ఆమె ఏం చేసింది? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

ఎలావుంది: కొరియ‌న్ చిత్రం ‘మిస్ గ్రానీ’ నుంచి తీసుకున్న కాన్సెప్ట్ ఇది. ద‌ర్శకురాలు నందినీరెడ్డి ఈ కాన్సెప్ట్‌ని చక్కగా తెలుగీక‌రించింది. చాలా సీరియస్ పాయింట్ ఇది. జీవితమంతా అనేక కష్టాలు అనుభవించి.. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఒక తల్లి.. ఆ కుటుంబానికి తనే భారంగా మారిపోయిన స్థితిలో.. తిరిగి యవ్వనాన్ని పొందడం, తర్వాత ఆమె ఎమోషన్స్.. చూపించడం అంత ఈజీ కాదు. ఐతే నందిని రెడ్డి ఈ విషయంలో విజయం సాధించింది.

మొదటి అరగంట పెద్దవాళ్లలో క‌నిపించే చాద‌స్తపు అల‌వాట్లు, కోడ‌ళ్లపై వాళ్లు చెలాయించే పెత్తనం వంటి అంశాల్నివినోదాత్మకంగా చూపించారు. ఈ సీన్స్ అన్నీ భలే టైం పాస్ అయిపోతాయి. ఐతే కోడ‌లు త‌న‌వ‌ల్లే ఆస్పత్రి పాలైంద‌ని తెలిసిన‌ప్పుడు, అక్కడి నుంచి బేబీ వెళ్లిపోయే సీన్ కొంచెం హెవీగా వున్న.. అస‌లు క‌థ మాత్రం బేబీ స్వాతిగా మారాకే మొద‌ల‌వుతుంది. ఈ క్రమంలో వచ్చిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. వృద్ధురాలిగా క‌నిపించిన ల‌క్ష్మిని పోలిన‌ట్టుగానే సమంత హావ‌భావాలు ప్రద‌ర్శించ‌డం, ఆమెలాగా న‌డ‌వ‌డం, మాట్లాడ‌టం ప్రేక్షకుల్ని వినోదం పంచుతుంది. వృద్ధురాలు ఉన్నట్లుండి పడుచుపిల్లగా మారిపోయినా.. ఆమె ఆహార్యం , యాస – మనస్తత్వం అన్నీ తన అసలు వయసుకు తగ్గట్లే ఉంటే ఎలా ఉంటుందో సమంత అద్భుతంగా అభినయించి చూపించింది.

ముఖ్యంగా బామ్మ ప‌డుచు పిల్లగా మారాక స‌న్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలైతే చాలా సహజ సిద్ధంగా నవ్వు తెప్పిస్తాయి. ఐతే ద్వితీయార్ధంలో ఎమోషన్ కొంచెం ఎక్కువైపోయిందనే భావన కలిగినా నటీనటులు తమ నటనతో ఆ వెలితి లేకుండా చూశారు. ఐతే ద్వితీయార్ధం కొంచెం లాగ్ ఐయిందనే మాట వాస్తవం. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కథని గ్రిప్పింగ్ గా నడిపింది దర్శకురాలు నందిని. ‘మిస్ గ్రానీ’ ఆత్మ చెడిపోకుండా ఆమె తెలుగులోకి తీసుకొచ్చిన విధానం మాత్రం కట్టిపారేసింది.

ఎవరెలా చేశారు? సమంత లేకుండ ఈ సినిమా లేదు. ఆమె నటనకి ఓ నంది ఖాయం. అంత బాగా చేసింది. ఆమె నటనలో మరింత పరిణితి కనిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు ఉన్నట్లుండి పడుచుపిల్లగా మారిపోయినా.. ఆమె ఆహార్యం , మనస్తత్వం ఎలా వుంటుందో అచ్చు ప్రింట్ కొట్టినట్లు నటించింది. లక్ష్మి పాత్ర ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. ఆకారం సమంతదే నైనా లక్ష్మి సినిమా అంతా కనిపిస్తుంది. మాట్లాడుతుంది. అలరిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన గుండెల్ని బ‌రువెక్కిస్తుంది. రాజేంద్రప్రసాద్ మరో మంచి పాత్ర దక్కింది. రావు ర‌మేష్‌, నాగ‌శౌర్య‌, ప్రగ‌తి, ఊర్వశి, ఐశ్వర్య‌.. ఇలా అంద‌రూ త‌మ పాత్రల ప‌రిధి మేర‌కు బాగా న‌టించారు. జ‌గ‌ప‌తిబాబు, అడివి శేష్ చిన్న పాత్రల్లో మెరిశారు.

రిచ‌ర్డ్ ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం బావుంది. సినిమా థీమ్ కు తగ్గ విజువల్స్ తో అతను ఆకట్టుకున్నాడు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం ఓకే . డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాలకి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఫైనల్ పంచ్ .. బేబీ.. బావుంది

About The Author

Reply