కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాయకత్వ లేమితో భాదపడుతుంది ఆ పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఆ పార్టీని కుదేలు చేసింది. అయితే ఇప్పుడు అందరి చూపు ప్రియాంక గాంధిపై పడింది. ఇప్పటికే ఆమెను యూపీ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు.
కాగ ఇప్పుడు కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదివి కూడా పప్రియాంకనే చేపట్టాలని డిమాండ్ లు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ అయితే బాగుంటుందని వాదిస్తున్నారు. ఇందులో బాగంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి తన గళం విప్పారు.
‘కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబీకులే ఉండాలన్నది నా వాదన కూడా. నాకు తెలిసి ఈ పదవికి ప్రియాంక గాంధీ అయితే సరిపోతుంది. ఆమె ఇందుకు 100% న్యాయం చేయగలరని మేం నమ్ముతున్నాం. అందరూ అంగీకరించే దృఢమైన నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్కు అవసరం’ అని చెప్పుకొచ్చారు అనిల్.