నాని గ్యాంగ్ ని చూశారా ?

నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `గ్యాంగ్‌లీడ‌ర్‌`. ఈ సినిమా దాదాపు చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మ‌రోవైపు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇటీవలే సినిమా ప్రీ లుక్ వదిలారు. నాని సహా ఐదుగురు చేతులున్న ఫొటోను పంచుకున్నారు. ఇప్పుడు గ్యాంగ్ రివీల్ అయ్యింది. ఇందులో నానితోపాటు నలుగురు మహిళలు, ఓ పాప కనిపించారు. వారంతా మేడపై నిల్చుని బైనాక్యులర్‌ పట్టుకుని దేన్నో చూస్తున్నారు. ‘బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..’ అని నాని వారి పాత్రలను ట్విటర్‌ ద్వారా పరిచయం చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

May 24, 2019

ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ని కాపాడుతుందా ?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాష్ట్రాల వారీగా పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్‌ దృష్టిసారించింది . ఈక్రమంలో రాష్ట్రాల వారీగా ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకుంది. ఎన్నికల్లో విఫలమైన తర్వాత ఆయా రాష్ట్రాల చీఫ్‌లు రాజీనామాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యూపీ కాంగ్రెస్ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఏడాది రాజకీయ అరంగేట్రం చేసిన ప్రియాంక గాంధీకి ఉత్తర్‌ ప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకూ తూర్పు యూపీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక.. ఇక రాష్ట్రం మొత్తం నాయకత్వం వహించనున్నారు. త్వరలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార భాజపా వీటిపై ఇప్పటికే దృష్టి సారించింది. దీంతో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్‌.. ప్రియాంకను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

May 24, 2019
Mukesh Goud Health

ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం విషమం

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. గత కొద్దిరోజులుగా తను కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమంగా మారటం తో అతని శరీరం సహకరించకపోవటం వలన వైద్యులు చికిత్సను నిలిపివేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్ పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. వైస్సార్ ప్రభుత్వం లో మంత్రిగా చేసారు. బాగా దృడంగా వుండే ముకేశ్ ను అభిమానులు ఈ పరిస్థితుల్లో చూసి షాక్ కి గురయ్యి ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

May 24, 2019
Akhil Angry On His Fourth Movie

హీరోయిన్ లేకుండా మొదలుపెట్టిన అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్-అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో సెట్స్ మీదకి వెళ్ళింది. గీతాసంస్థ నిర్మించే సినిమా ఇన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే వుండిపోయింది. ఇప్పుడు షూట్ స్టార్ట్ అయింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. మొదట పెద్ద హీరోయిన్ ని అనుకున్నారు. కానీ నిర్మాత అరవింద్ దానికి సుముఖం చూపలేదు. ఇప్పుడు నివేదా పేతురాజ్‌ను ఎంపికచేసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. కథ ప్రకారం హీరోయిన్ లేకుండా తీసే సీన్లు ఎక్కువే వున్నాయి. అందుకే ముందు ఆ సీన్లు అన్నీ తీసేయాలనే షూటింగ్ మొదలు స్టార్ట్ చేశారు. త్వరలోనే హీరోయిన్ పై క్లారిటీ వస్తుంది.

May 24, 2019
Roja APIIC Chairman

పని మొదలు పెట్టిన రోజా !!

నగరి నుంచి రెండవసారి ఎమ్మెల్యే గా గెలిచిన రోజాకి వైసీపీ ప్రభుత్వం లో మంత్రి పదవి ఖాయం అని అందరు అనుకున్నారు. కాని రోజాకి జగన్ మంత్రి పదవి ఇవ్వకుండా ” ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా ఈరోజు ఆర్కే రోజా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజాకి పలువురు అభినందలు తెలిపారు.రోజా ఈపదవి లో రెండు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను అంతే కాదు పెట్టుబడులు పెట్టేవారికి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అని తెలియచేసింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపింది.

May 24, 2019

మండలిలో మండిపడ్డ లోకేష్ బాబు

నారా లోకేష్ ప్రత్యేక్ష ఎన్నికల్లో రాకుండానే మంత్రి అయిపోయారు. చంద్రబాబు కుమారుడు కారణంగా రెండేసి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఐతే ఈ ఎన్నికల్లో కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయిన లోకేష్ .. ట్విట్టర్ కి పరిమితమైపోయారు కొన్నాళ్ళుగా. ఐతే ఇప్పుడు ఎమ్మెల్సీ గా శాసనమండలిలో తన స్వరం వినిపించాడు లోకేష్. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలో భాగంగా శాసనమండలిలో మాట్లాడాడు లోకేష్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శ్వేతపత్రంలో ఒకలా, బడ్జెట్‌లో మరొకలా చెప్పారని.. రాష్ట్ర ప్రజలు దేన్ని నమ్మాలని ప్రశ్నించారు. వైకాపా నుంచి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? అని నిలదీశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యానందిస్తామని జగన్ పాదయాత్రలో చెప్పారని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించాడు లోకేష్.

May 24, 2019

‘బిజెపిని గుడ్డలూడదీసి కొడతారు’

బిజెపి ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ యాక్షన్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. కేంద్రంలో అధికారం అడ్డుపెట్టుకొని ఏపీలో పార్టీని విస్తారించాలని భావిస్తోంది బిజెపి. తప్పు లేదు. కానీ ఈ క్రమంలో బిజెపి ప్రవర్తిస్తున్న తీరు అంత బాలేదు. వివిధ పార్టీలలోని నేతలని కొనుక్కొని పార్టీలో నింపుకుంటుంది బిజెపి. పార్టీలో చేరిన నేతలు కేంద్రంలో మోడీని చూసుకొని ఏపీలో జెండా పాతుతామని బిల్డప్ కొడుతున్నారు. ‘ఇక మనదే రాజ్యం’ అంటున్నారు. సుజానా చౌదరి లాంటి నాయకులైతే పార్టీలో చేరి రెండు వారాలు కాలేదు కానీ ”ఏపీలో బిజెపినే సరైన ప్రత్యన్యాయమని’ డాంబికాలుపోతున్నారు. బిజెపి అవలంభిస్తున్న ఈ ధోరణి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైయింది. కేవలం జంపింగ్ జాక్స్ చేరినంత మాత్రాన పార్టీ గెలిచేస్తుందని బీజేపీ భావించడం సరైన పద్దతి కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఏపీకి బిజెపి ఏం చేసిందని ఓట్లు అడగటానికి వస్తారని అంటున్నారు. ఇంకొందరు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఏపీ ప్రజల

May 24, 2019
Kumaraswamy

గురువారం కుమారస్వామికి బలపరీక్ష ..టెన్షన్ టెన్షన్

కర్ణాటక లో రాజకీయం రసవత్తరంగా ఉంది, ఎట్టకేలకు స్పీకర్ రమేశ్ కుమార్‌ బలపరీక్షకు అధికారపక్షానికి గురువారం వరకు గడువు ఇచ్చారు. కుమారస్వామి బలపరీక్ష కు సిద్ధమని ఆల్రెడీ ప్రకటించాడు. బీజేపీ మాత్రం బలపరీక్ష ఈరోజే పెట్టమని విధానసభలో ప్లకార్డులతో డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధ రామయ్య కూడా బలపరీక్ష కు తమ ప్రభుత్వం సిద్ధం అని చెప్పారు. జేడీఎస్‌-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటకలో రాజకీయం సంక్షోభం లో పడింది. కర్ణాటకలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 16 మంది రాజీనామాలు చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై రేపు సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించనుంది. ఒకవేళ రాజీనామా లు కనుక ఆమెదించాలని తీర్పు వస్తే అప్పుడు మొత్తం సంఖ్యాబలం 208 కి వస్తుంది. 105 మంది కనుక మద్దతు ఉంటే కుమారస్వామి ప్రభుత్వం నిలుస్తుంది లేకపోతే పడిపోవటం ఖాయం. బీజేపీ సంఖ్యాబలం స్వత్రంత్ర అభ్యర్థులతో కలిసి 107 ఉంది. చూడాలి

May 24, 2019

ఆటో అంబులెన్స్ నడుపుతున్న 76 ఏళ్ళ పెద్దాయన

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 1.5 లక్షలకు పైగా ప్రజలు చనిపోతున్నారు. 76 ఏళ్ల హర్జిందర్ సింగ్ అనే మాజీ ట్రాఫిక్ వార్డెన్, రాజధాని నగరం ఢిల్లీలో ఓక ‘ఆటో అంబులెన్స్’ నడుపుతున్నాడు. ట్రాఫిక్ వార్డెన్‌గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది ఆక్సిడెంట్ కు గురవ్వటం చూసాను. ఒక ఆటో కొని అంబులెన్సు లాగ తిప్పితే ప్రమాదాల బారిన పడే వారిని రక్షించగలం అని భావించాను అని చెప్తున్నాడు హర్జిందర్ సింగ్. 76 సంవత్సరాల వయస్సులో, సింగ్ రోజు ఉదయం 8 గంటలకు తన పనిని మొదలుపెడతాడు, తన కుటుంబ అవసరాలను తీర్చడానికి మరియు ప్రమాదాలకు గురైన వారికి మందులు మరియు అతని ఆటోకు ఇంధనం కొనడానికి ఈ వయసులో కూడా అదనంగా పని చేస్తున్నాడు. అంతేకాకుండా, సింగ్ తన రోగులను ఎప్పుడూ డబ్బు అడగడు .తన ఆటో వెనుక సీటు వద్ద విరాళం పెట్టెను ఒకటి పెట్టాడు, అందులో ఎవరికైనా

May 24, 2019

బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ కు అదిరిపోయే పంచ్ ఇచ్చిన సల్మాన్

బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ … ఓ టేబుల్‌పై బాటిల్‌ పెట్టాలి. దాని మూతను బాటిల్‌కు పూర్తిగా తిప్పి పెట్టకూడదు. కొద్దిదూరంలో నిలబడి కాలితో బాటిల్‌ క్యాప్‌ను తన్నాలి. అయితే ఈ ప్రక్రియలో ఆ బాటిల్‌ కిందపడకూడదు” ఇప్పుడు ఈ ఛాలెంజ్ వెర్రిగా చేస్తున్నారు జనాలు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ విన్యాసం చేశాడు. అయితే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మాత్రం బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ కి ఒక పంచ్ ఇచ్చాడు. బాటిల్‌ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ… ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అని ఓ మెసేజ్ ఇచ్చాడు. దీంతో బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌ వెర్రితో కొట్టుకుంటున్నావారందరికి పంచ్ ఇచ్చినట్లయింది. Don’t thakao paani bachao pic.twitter.com/PjfdGxdTJg — Salman Khan (@BeingSalmanKhan) July 14, 2019

May 24, 2019

రివ్యూ: సీత

సినిమా టైటిల్: సీత
తారాగణం: కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌, సోనూసూద్‌, మన్నారా చోప్రా, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
దర్శకుడు: తేజ

తేజ సినిమా అంటే ఓ సంచలనం. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడాయన. ఐతే పూర్వ ప్రభ ఆయనలో లేదు. తేజ మార్క్ వర్క్ అవుట్ కావడం లేదు. దింతో తనదారి మార్చుకొని`నేనే రాజు నేనే మంత్రి`తీశారు. ఈ సినిమా తేజకి కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు అదే ఇమేజ్ తో సీతని తెరకెక్కించారు. మరి ‘సీత ‘తేజకి విజయం ఇచ్చిందా ? అసలు ఇంతకీ ఈ సీతలో ఏముంది? తెలియాలంటే రివ్యూలో వెళ్దాం.

కథ: సీత(కాజల్) డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. అంతకంటే కన్నింగ్. డబ్బు కోసం మానం కూడా అమ్ముకునే రకం. ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూసూద్‌) సీతపై మనసు పారేసుకుంటాడు. తనకు కోట్ల రూపాయిల నష్టం వస్తుందని తెలిసి బ‌స‌వ‌రాజుతో నెల రోజులు కాపురం చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది సీత. రామ్ (బెల్లంకొండ శ్రీ‌నివాస్‌) అమాయకుడు. స్వాతిముత్యం. సీత అత్త కొడుకు. ఆస్తి రామ్ పేరు మీద వుంటుంది. దింతో రామ్ ని సొంతం చేసుకోవాలని అతడికి దగ్గరికి వెళ్ళుతుంది సీత. అగ్రిమెంట్ చూపించి కోరిక తీర్చాలిసిందేనని వెంటపడుతుంటాడు బ‌స‌వ‌రాజు. చివరికి ఈ ముగ్గురు ఏమయ్యారనే సంగతి తెలియాలంటే సీతని సిల్వర్ స్క్రీన్ పై చూడాలి.

ఎలా వుంది? కథ చెప్పమంటే మూడు క్యారెక్టర్లు గురించి చెప్పారేంటని అనుకుంటున్నారా? నిజమే ఈ సినిమాలో కథ లేదు. పాత్రలు మాత్రమే వున్నాయి. క్యారెక్టరైజేషన్ బెష్డ్ సినిమా ఇది. మూడు పాత్రలు రాసుకున్న తేజ.. ఆ పాత్రల నుండే వినోదం పంచాలని భావించాడు. ఆలోచన బావుంది కానీ దాన్ని తీర్చి దిద్దడంలో తడబాటు కనిపిస్తుంది.

సినిమా మొదటి సగం క్యారెక్టరైజేష‌న్‌పైనే నడుస్తోంది. సినిమా మొదలైన పది నిమిషాలకే ఇందులో కథ లేదని తెలుస్తుంది. కేవలం క్యారెక్టరైజేష‌న్‌పైనే సీన్స్ ని లాక్కొచ్చాడు తేజ. ఐతే రానురాను ఇది కాస్త విసుగు తెప్పించే వ్యవహారంగా మారుతుంది. డబ్బే లోకం అనుకునే సీత.. ఆమెను అనుభవించాలని తపించిపోయే బ‌స‌వ‌రాజు .. కల్లాకపటం తెలియని స్వాతిముత్యం లాంటి రామ్.. ఇవి మూడు పాత్రలు. అయితే వీటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం అంత ఆసక్తికరంగా లేవు. మొదటిసగం పాత్రల పరిచయం వాటి స్వభావాలని ఆ పాత్రల నుండే చూపించిన తేజ.. రెండో సగం మాత్రం ఏం చేయాలో అర్ధంకాక ఏవో సన్నివేశాలని పేర్చుకుంటూ క్లైమాక్స్ కి తీసుకువెళ్లిపోయాడు. ఐతే ఆ క్లైమాక్స్ కూడా ఊహించినట్లే సాగుతుంది. దింతో కధనం నీరుగారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

అలాగే సీత క్యారెక్టరైజేష‌న్‌పై అతిగా ఆధార‌ప‌డిపోయిన తేజ.. మిగిలిన పాత్రల్ని అంత ప్రభావ‌వంతంగా న‌డిపించలేక‌పోయారనిపిస్తుంది. రామ్‌గా బెల్లంకొండ శ్రీ‌నివాస్ రాంగ్ కాస్టింగ్. అమాయకత్వం ఆయన మొహంలో అదోలా కనిపించింది. కొన్ని చోట్ల ఆ నటన, పాత్ర విసుగు కూడా తెప్పించింది. కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలి కొత్త కాదు. తేజ సోనూ సూద్ పాత్రని కూడా కామెడీ యాంగిల్ లో తీర్చిదిద్దాడు. వినోదం పంచడంలో ఇది వర్క్ అవుట్ అయ్యింది. కాకపోతే సినిమాలో కాంఫ్లిక్ట్ పై ఇంకాస్త ద్రుష్టి పెట్టాల్సిందే. బేసిగ్గా ఈ సినిమాలో కథ లేదు. కనీసం పాత్రల మధ్య సంఘర్షణ ఐయినా సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారు. దింతో ప్రేక్షకుడు పాత్రలతో ట్రావెల్ అయ్యే అవకాశం లేకుండాపోయింది.

ఎవరెలా చేశారు ? కాజల్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఒక విధంగా ఆమెనే హీరో. పాత్రలో వున్న వైవిధ్యంని అర్ధం చేసుకున్న కాజల్.. దర్శకుడు రాసుకున్న పాత్రలో ఒదిగిపోవడానికి తనవంతు కృషి చేసింది. కాజల్ కెరీర్ ఇదో డిఫరెంట్ రోల్. సరికొత్త కాజల్ లో సీతలో కనిపిస్తుంది. అందంగా కనిపించింది. ఐతే మేకప్ కాస్త ఓవర్ అయ్యిందనే ఫీలింగ్ కలుగుతుంది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు. ఈ రామ్ పాత్ర ఆయనకి పూర్తిగా కొత్త. అమాయకత్వం ఆయన మొహంలో అంత చక్కగా పలకలేదనే భావన ఐతే కలుగుతుంది. ఐతే ఆ పాత్రలో పుట్టిన వవినోదం మాత్రం అక్కడక్కడా అలరిస్తుంది. విలన్ గా చేసిన సోనూసూద్ నటన బావుంది. విలన్ గ్యాంగ్ కూడా అక్కడక్కడా నవ్వులు పూయిస్తుంది. తనికెళ్ళ భరణి సెటైర్లు కొన్ని పేలాయి. బిత్తిరి సత్తి ఎపిసోడ్ కాస్త అతిగా వుంటుంది. మన్నారా చోప్రా గురించి చెప్పడానికి ఏమీ లేదు. పాయల్ రాజ్ పుత్ ఐటెం సాంగ్ ఓకే. మిగతా పాత్రలు పరిధిమేర చేశాయి

టెక్నీకల్ గా సినిమా ఉన్నతంగా వుంది. అనూప్ నేపధ్య సంగీతం బావుంది కానీ పాటలు రిజిస్టర్ కాలేదు. మంచి సినిమాటోగ్రఫీ కుదిరింది. నిర్మాణ విలువలకు డోకా లేదు.

ఫైనల్ పంచ్ : సీత .. ‘తీత’ ఇంకాస్త బాగుండాల్సింది.

About The Author

Reply