ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు హీరో సూర్య. జగన్, సూర్య కి మధ్య మంచి అనుబంధం వున్న సంగతి తెలిసిందే. భారతి సిమెంట్స్ కి సూర్య బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించారు. ఆ రకంగా కూడా సూర్య , జగన్ స్నేహితులు. ఇప్పుడు జగన్ సిఎం కాబోతున్నారు. ‘ఎన్జీకె’ సినిమా ప్రమోషన్స్ కి హైదరాబాద్ వచ్చిన సూర్య జగన్ గురించి ప్రస్తావించారు.
‘చాలా సంతోషంగా ఉంది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. తను ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి. ప్రస్తుతం జగన్ పై హిమాలయాలంత బరువు ఉంది. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు సూర్య చెప్పారు. ఇక ‘యాత్ర 2’లో సూర్య నటిస్తారనే వార్తలపై మాట్లాడుతూ.. ‘ఆ కథ నా వరకూ వచ్చి, స్క్రిప్టు నచ్చితే తప్పకుండా చేస్తా’ చెప్పారు సూర్య.