గుత్తా జ్వాలాకి డీల్ సెట్ కాలేదు

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 3’పై ఇప్పటినుంచే ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగ దీనిపై జ్వాల ట్విటర్‌ వేదికగా స్పందించారు. తన గురించి వస్తున్న వదంతుల్లో ఎలాంటి నిజం లేదని, తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ షోలో పాల్గొనాలని జ్వాలకు అవకాశమిస్తే ఆమె ఎక్కువ పారితోషికం అడిగారని అందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఆమె పాల్గొనడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. కాగా ‘బిగ్‌బాస్‌’ మొదటి సీజన్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండో సీజన్‌కు నానిని తీసుకున్నారు. మూడో సీజన్‌కు నాగార్జునను అనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేస్తారు.

March 29, 2019

అభిమానుల ఓవర్ యాక్షన్ ని కట్ చేసిన పవన్ కళ్యాణ్

వెండితెరపై పవర్ స్టార్ గా వెలిగిపోయిన పవన్ కళ్యాణ్ కి ఓటర్లు షాక్ ఇచ్చారు. సినిమా టికెట్లు తెగినంత ఈజీ.. రాజకీయం కాదని రుజువు చేశారు. గాజువాక, భీమవరంల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఘోరంగా దెబ్బ తిన్నారు. భీమవరంలో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో మరో వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయితే భీమవరం ఫలితం పై పవన్ కళ్యాణ్ అభిమానులు లేనిపోని హంగామా చేస్తున్నారు. భీమవరంలో తొలుత పవన్ కు మెజారిటీ వచ్చిన మాట వాస్తవం తర్వాత ఆయన వెనుకబడ్డారు. అయితే ఓట్ల లెక్కింపు విషయంలో గోల్ మాల్ చోటుచేసుకుందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు వీడియోలు సృస్టించి ఏదో హడావిడి చేస్తున్నారు అయితే దీనిపై పార్టీ అధికారికంగా స్పందించింది. భీమవరంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని జనసేన పార్టీ తెలిపింది. పోలైన

March 29, 2019

మోడీతో జగన్ భేటి.. ఇదే అజెండా

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఢిల్లీలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ప్రత్యేక కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. ఈ కాన్వాయ్ లో జగన్ ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్‌ ఆహ్వానించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంవంటి అంశాల్ని జగన్‌ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. మోదీతో భేటీ అనంతరం జగన్‌ ప్రధాని నివాసం నుంచి ఏపీ భవన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం ఏపీ భవన్‌లోనే చేసి సాయంత్రం తిరుగు ప్రయాణమవుతారని ఏపీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

March 29, 2019

వర్మకి షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు

విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లో ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు పంపారు. విజయవాడ నార్త్ జోన్ ఏసీపీ రమేశ్ బాబు ఈ నోటీసులు జారీ చేస్తూ, వర్మకు కొన్ని సలహాలు ఇస్తూ, మరికొన్ని హెచ్చరికలు చేశారు. బహిరంగ ప్రదేశంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో రాంగోపాల్‌వర్మను వ్యతిరేకించే వర్గం కార్యక్రమాన్ని అడ్డుకోవచ్చని, దీని వల్ల ఘర్షణలు, ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రెస్‌ క్లబ్‌లో లేదా ఏదైనా సమావేశ మందిరంలో నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగర పరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలు, ఎన్నికల కోడ్‌ అమలులో ఉందనని, ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతించమన్నారు. పైపులరోడ్డు విజయవాడ-హైదరాబాద్‌ ప్రధాన మార్గం కావటంతో నిత్యం రద్దీగా ఉంటుందని, అత్యవసర సర్వీసులు తిరిగే ఈ మార్గంలో విలేకరుల సమావేశంతో ట్రాఫిక్‌కు

March 29, 2019

మనసు మార్చుకున్న లారెన్స్

‘కాంచన’ సినిమాకు హిందీ రీమేక్‌గా వస్తున్న ‘లక్ష్మీబాంబ్‌’ నుండి దర్శకుడు రాఘవా లారెన్స్‌ తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకి విలువ లేని చోట ఉండలేనని ఒక ప్రకటన చేసి సినిమా నుండి బయటివస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన మనసు మార్చుకున్నారు. మళ్ళీ ఆయనే దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు. ”నేను ‘లక్ష్మీబాంబ్’ సినిమా నుంచి తప్పుకొంటున్నట్లు గతంలో ప్రకటించాను. ఆ తర్వాత నాకు అక్షయ్‌ సర్‌ అభిమానులు, నా అభిమానుల నుంచి వరుసగా ట్వీట్లు వస్తున్నాయి. సినిమాకు నేనే దర్శకత్వం చేయాలని కోరుతున్నారు. ఈరోజు నిర్మాతలు నన్ను కలవడానికి చెన్నై వస్తున్నారు. సినిమాకు ఎవరు దర్శకత్వం వహించాలన్నది వారే నిర్ణయిస్తారు. నా పనిని వారు గౌరవిస్తే అప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలా? వద్దా? అన్నది ఆలోచిస్తాను” అని చెప్పుకొచ్చారు లారెన్స్.

March 29, 2019

‘రణరంగం’లో శర్వానంద్

ఎట్టకేలకు శర్వానంద్ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయ్యింది. శర్వానంద్‌ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చాలా టైటిల్స్ పరిశీలించిన తర్వాత ఈ సినిమాకు ‘రణరంగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో శర్వా స్మోక్ చేస్తూ గుబురు గడ్డం, మాసిన జుట్టుతో దర్శనమిచ్చారు. ఇందులో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 2న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్యాంగ్ స్టార్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుంది.

March 29, 2019

సమంతతో ఎంజాయ్మెంట్ మాములుగా ఉండదు 

నందినిరెడ్డి..  సమంతతో `మిస్ గ్రానీ ‘ అనే కొరియన్ సినిమాని తెలుగులో రీమేక్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదలైయింది. టీజర్ లో సీనియర్ నటి లక్ష్మిని ఇమిటేట్ చేస్తూ.. ఆమె వాయిస్ గుర్తుకు వచ్చేలా సమంత చెప్పిన డబ్బింగ్ భలేగా వుంది. ‘మిస్ గ్రానీ’ కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. 70 ఏళ్లు దాటిన ఓ బామ్మ ఫ్యామిలీ సభ్యులతో సమస్యలతో కొడుకు నుంచి విడిపోతుంది. ఆ తర్వాత విడిగా ఉండి ఓ రోజు ఓ ఫొటో తీసుకుందామని స్టూడియోకు వెళ్తుంది. అయితే అక్కడ జరిగిన కొన్ని అనూహ్యమైన సంఘటనలతో పాతికేళ్ల యువతీగా మారిపోతుంది. టీజర్ చూస్తే అదే కథని తీసుకున్నారనిపిస్తోంది. చివర్లో సమంత.. ”నాతొ ఎంజాయ్ మెంట్ మాములుగా వుండదండి” అనే చెప్పిన డైలాగ్  ఫన్నీగా వుంది.

March 29, 2019

చంద్రబాబు లెక్కని దేవుడే సెట్ చేశాడు

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని దారుణంగా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. జగన్ కు అద్భుతమైన విజయం అందించారు. చంద్రబాబు కి కేవలం 23 సీట్లు మాత్రమే మిగిలాయి. కాగా ఈ 23 సంఖ్యకి ఒక స్పెషాలిటీ వుంది. జగన్ పార్టీ నుండి చంద్రబాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య ఇది. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా జగన్ గుర్తు చేశారు. ‘అన్యాయం, అధర్మం చేస్తే దేవుడు తప్పక శిక్షిస్తాడు. వైకాపా నుంచి అక్రమంగా 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మే 23నే చంద్రబాబుకు దేవుడు తగిన బుద్ధి చెప్పాడు. 23 సంఖ్యతో దేవుడు గొప్పగా స్క్రిప్ట్ రాశాడు” అని చెప్పుకొచ్చారు జగన్. ఇక వైకాపా శ్రేణులు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశాయి. చంద్రబాబుకి దేవుడే లెక్క సరి చేశాడని అంటున్నారు.

March 29, 2019

సాహోలో సల్మాన్ .. ఇదేం గోలండి బాబూ

ప్రభాస్ సాహో సినిమా పూర్తి కావచ్చింది. ఈ దశలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. అయితే అందులో నిజం లేదని తాజాగా దర్శకుడు సుజిత్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘మా సినిమాలో సల్మాన్‌ అతిథి పాత్రలో నటించడం లేదు. అయినా సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తయినప్పుడు ఇలాంటి వదంతులు ఎలా పుట్టుకొస్తున్నాయి?. వీటిలో ఎంతమాత్రం నిజంలేదు. ఇలాంటివి నమ్మకండి’ అని ట్వీట్ చేశాడు సుజిత్. ‘బాహుబలి 2’ వంటి సినిమా తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్. ఈ చిత్రం ఆగస్ట్ ‌15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

March 29, 2019

రవిప్రకాశ్‌ అరెస్ట్.. రామేశ్వర్ రావు డైరెక్షన్ లో ?

టీవీ9 మాజీ రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధమైంది. సంస్థ కొత్త యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు విచారణకు హాజరుకావాల్సిందిగా రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా రవిప్రకాశ్‌ పోలీసుల ముందుకు రాలేదు. అజ్ఞాతంలో ఉండి.. తనకు ఇబ్బందులు ఉన్నాయని, ఆరోగ్యం బాగోలేదని, 10 రోజులు గడువు కావాలని, సైబరాబాద్‌ పోలీసులను కోరినా ఫలితం లేకపోయింది. ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయన బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేసింది. తాజాగా ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. ”టీవీ9 న్యూస్ ఛానెల్‌ను స్థాపించింది నేను. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని లాభాల బాటలో నడిపించింది నేను. శ్రీనీరాజు ఆర్థికంగా అందగా నిలిచారు. విలువలకు కట్టుబడి టీవీ9 సంస్థను నడిపించాం. అనేక రాష్ట్రాల్లో నం.1 న్యూస్ ఛానెల్‌గా టీవీ9 ఎదిగిందని చెప్పిన రవి.. మేశ్వర్ రావు (మై హోమ్స్

March 29, 2019

రివ్యూ: సూర్యకాంతం

సినిమా టైటిల్ : సూర్యకాంతం
నటీనటులు: నిహారిక , రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియా, సుహాసిని తదితరులు
సంగీతం: మార్క్‌ కె రాబిన్‌
నిర్మాతలు: వై. సందీప్‌, వై. సృజన
దర్శకత్వం: ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలంతా నిలబడ్డారు. వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్లు ఖాతాలో వేసుకున్నారు. కానీ మెగా డాటర్ గా వెండితెరపై అడుగుపెట్టిన నిహారికకు ఇంకా హిట్ పడలేదు. ‘ఒక మనసు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిహారిక తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు కలసి రాలేదు. కనీసం నటిగా కూడా మార్కులు పడలేదు. ఐతే ఎలాగైనా ఓ హిట్ కొట్టాలని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సూర్యకాంతం’ సినిమాతో. మరి ఈ సినిమా నిహారిక కోరుకుంటున్న హిట్ ఇచ్చిందా ? అసలీ ‘సూర్యకాంతం’ కథ ఏమిటి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాలసిందే.

కథ: సూర్యకాంతం (నిహారిక‌) అల్లరి గడుసుదనం మిక్స్ చేసిన అమ్మాయి. ఎవరినీ అంత ఈజీగా నమ్మేకరం కాదు. అలాంటి అమ్మాయి జీవితంలోకి అభి (రాహుల్ విజ‌య్‌) వ‌స్తాడు. సూర్యకాంతం యాటిట్యూడ్ చూసి ప్రేమలో పడతాడు. అభి త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ని బ‌య‌ట పెట్టాల‌నుకునేలోపే సూర్యకాంతం ఇంటి నుంచి మాయ‌మైపోతుంది. ఏడాదిపాటు ఎదురు చూసినా తిరిగి రాదు. దాంతో ఇంట్లో పెద్దలు కుదిర్చిన పూజ (పెర్లిన్‌)తో పెళ్లికి ఒప్పుకొంటాడు అభి. కొన్ని రోజుల్లో నిశ్చితార్థం అన‌గా సూర్యకాంతం మళ్ళీ అభి జీవితంలోకి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అభి ఎవరితో జీవితం పంచుకున్నాడు ? అసలు సూర్యకాంతం ఏడాది పాటు ఎక్కడికి వెళ్ళింది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా వుంది? కథ గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. ఐతే వెండితెరకు ఆ పాయింట్ పనికొస్తోందా ? లేదా అనే జడ్జిమెంట్ దర్శకుడి ఉండాలి. తీసుకున్న పాయింట్ ని ఎంత కొత్తగా చూపిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం. సూర్యకాంతం సినిమా విషయానికి వస్తే… ఇదేం కొత్తకథ కాదు.. కానీ ట్రీట్మెంట్ ని కాస్త కొత్తగా రాసుకున్నాడు దర్శకుడు. ఐతే ఈ కొత్తదనం సినిమా మొత్తం కనిపించలేదు. ప్రేమదేశం సినిమా కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే .. ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయి కూడా ఇద్దరి అబ్బాయిలని ఇష్టపడుతుంది. ఎవరినీ వదులుకోవడాని ఇష్టపడదు. సూర్యకాంతం కూడా ఐదే పాయింట్. ఒక అబ్బాయి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఏ అమ్మాయిని కూడా వదులుకోవాలని ఆ అబ్బాయికి ఉండదు. ఈ పాయింట్ ని ఫ్యామిలితో మిక్స్ చేసి కధనం రాసుకున్నాడు దర్శకుడు.

సినిమా హుషారుగా మొదలౌతుంది. ఐతే తొలిసగంలో ఎక్కువ భాగం పాత్రల పరిచయాలకె తీసుకున్నాడు దర్శకుడు. దింతో పాత్రలు పరిచయం పూర్తవ్వడానికె ఇంటర్వెల్ కార్డు వరకూ తీసుకొచ్చాడు. ఈ తొలిసగంలో నిహారిక చేసిన అల్లరి అక్కడక్క నవ్విస్తుంది. కొన్ని చోట్ల మాత్రం మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అనే ఫీలింగ్.

ఐతే ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత అసలు కథ మొదలౌతుంది. సూర్యకాంతం, అభి, పూజ ల మధ్య జరిగే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, వారి మధ్య సంఘర్షణ ప్రస్తుత యువత ఆలోచనలకు దగ్గరగా వుంటుంది. అయితే క్లైమాక్స్ కి వచ్చేసరికి దర్శకుడి తడబాటు కనిపించింది. సూర్యకాంతం ఇల్లు వదిలి వెళ్లిపోయే సీన్ వెనుక వున్న కథని అంత కన్వెన్సింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. అయితే చివర్లో సుహాసిని పాత్రని ఉపయోగించుకున్న విధానం సినిమాకి కొత్తదనం తీసుకొచ్చింది.

ఎవరెలా చేశారు? నిహారికకి ఇది మూడో సినిమా. యాక్టింగ్ లో ఈజ్ కనిపించింది. ఐతే దర్శకుడు సూర్యకాంతం పాత్రని రాసుకున్న విధానం ఏమిటో గానీ కొన్ని చోట్ల నిహారిక చిరాకు తెప్పిస్తుంది. ఒక దశలో ఆమెది నెగిటివ్ పాత్రనా ? అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అభి పాత్రతో రాహుల్ నటన బావుంది. సెటిల్ గా చేశాడు. పూజా పాత్ర కూడా బావుంది. ఆ పాత్రలో ఎలాంటి కంప్లైంట్ లేకుండా నటించింది. సత్య ఓ రెండు సన్నివేశాల్లో నవ్విస్తాడు. సుహాసిని పాత్ర కూడా బావుంది. మిగతా నటీనటులు పరిధిమేర నటించారు,

టెక్నీకల్ గా.. ఈ సినిమా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి.. షార్ట్ ఫిలిమ్స్ తో పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఈ షార్ట్ ఫిలిం దర్శకులతో ఓ సమస్య వుంది. టేకింగ్ నిదానంగా వుంటుంది. సూర్యకాంతంలో కూడా ఆ సాగదీత కనిపించింది. సన్నివేశాల్లో వేగం పెరిగితే ఫలితం ఇంకొంచెం బేటర్ అనే అభిప్రాయం రాకమానదు. మార్క్‌ కె రాబిన్‌ అందించిన సంగీతం ఓకే. కెమరా పనితనం కూడా బావుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

చివరిగా.. మూడు పాత్రలు రాసుకొని ఆ ముగ్గురి చుట్టూ కథని నడిపాడు దర్శకుడు. అయితే ఈ నడక కొంత హుషారుగా మరికొంత నీరసంగా ఇంకొంత ఆయాసంగా సాగింది.

ఫైనల్ పంచ్ : సూర్యకాంతం.. జస్ట్ పాస్ !

About The Author

Reply