నటిగా రాధికా ఆప్టే టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత క్లిష్టమైన సీనైనా, ఎంత బోల్డ్ సన్నివేశమైనా నటించడానికి ఆమె సిద్ధం. సినిమాల సంగతి పక్కనపెడితే వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటించడం ఆమెకు హాబీ. న్యూడ్ సీన్లకు కూడా అభ్యంతరం చెప్పదు ఈమె. అయితే ఇటీవలే ఈ భామ నటించిన ఒక వెబ్ సిరీస్ లో న్యూడ్ సీన్ ఒకటి లీకైంది.

Radhika Apte
దీని గురించి స్పందించిన రాధికా.. ఆ సీన్ లీక్ చేసినవాళ్లపై ఫైరైంది. ఇక్కడవరకూ బానే ఉంది కానీ ఆ తర్వాత ప్రశ్న హాట్ టాపిక్ అయింది. ఇలాంటి సీన్లలో అందరూ నటి గురించే ఎందుకు మాట్లాడతారో తనకు అర్ధం కాదని.. అక్కడ నటుడి ప్రమేయం కూడా అంతే ఉంటుంది కదా అంటోంది రాధికా. కానీ కేవలం నటి గురించే డిస్కషన్ ఉంటుంది. ఆమె మీదే ఫోకస్ అంతా అని వాపోయింది. అమాయకంగా ఆందో లేక నిజంగా తెలీకే ఆందో కానీ దీనికి రెస్పాన్స్ భీభత్సంగా వస్తోంది.